నిందితుడు జితేంద్రను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి, బొమ్మనహళ్లి : సూర్యాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నాగర గ్రామంలో ఈనెల 13న చోటు చేసుకున్న బిహార్ కార్మికుడు ఇక్బాల్‌షా హత్యోదంతం మిస్టరీ వీడింది. ఉడకపెట్టిన కోడిగుడ్డు విషయంలో తగాదా ఏర్పడి స్నేహితుడే ఇక్బాల్‌షాను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాలు...బిహార్‌కు చెందిన ఇక్బాల్‌షా(25), జితేంద్రలు ఆరు నెలల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. హెన్నాగర గ్రామంలో ఇళ్ల నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే చోట అన్నం వండుకొని బస చేసేవారు. ఈ నెల 13న రాత్రి భోజనం చేసే సమయంలో ఉడకబెట్టిన కోడి గుడ్లను ఇక్బాల్ షా ఎక్కువగా తినడంతో స్నేహితుడు జితేంద్ర ఆగ్రహానికి లోనయ్యాడు. (పచ్చని సంసారంలో.. అక్రమ బంధం చిచ్చు)
సుత్తి తీసుకొని ఇక్బాల్‌షా తలపై బాది హత్య చేశాడు. మృతదేహాన్ని నీటి ట్యాంకు కోసం తీసిన గుంతలో పడేసి ఉడాయించాడు. రక్తం మరకలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడిని ఇక్బాల్‌షాగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. మృతుడి జతలో ఉన్న జితేంద్ర కనిపించకపోవడంతో అతనిపై అనుమానంతో గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించడంతో ఆదివారం అరెస్ట్ చేశారు. (మహాబలిని మట్టికరిపించిన వేళ...)
Comments
Please login to add a commentAdd a comment