►పెదవులు పొడిబారుతుంటే... కీరదోస ముక్కతో ఐదు నిమిషాల సేపు పెదవుల మీద వలయాకారంగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మూడు లేదా నాలుగు రోజుల్లోనే పెదవులు మృదువుగా మారతాయి.
►టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్.
►టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment