
మాట్లాడుతున్న కలెక్టర్ సత్యనారాయణ
కామారెడ్డి క్రైం: జిల్లాలో ప్లాస్టిన్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం త్వరలోనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రెండు కిలో ల ప్లాస్టిక్‌ను సేకరించి ఇస్తే అర డజన్ గుడ్లు ఉచితంగా అందించనున్నట్లు కలెక్టర్ సత్యనారాయ ణ ప్రకటించారు. శనివారం అధికారులతో స మావేశమయ్యారు. జిల్లాలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూ చించారు. రెండు కిలోల ప్లాస్టిక్‌ను ఏరివేసిన వారికి స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా గుడ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎం పీడీవోలు, పోలీసు, రెడ్‌క్రాస్ సభ్యులు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment