ఎగ్ బుర్జీ బాల్స్ ఇలా సులువైన పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకోండి!
ఎగ్ బుర్జీ బాల్స్ తయారీకి కావలసినవి:
►బ్రెడ్ పౌడర్ – పావు కప్పు + 3 టేబుల్ స్పూన్లు
►గుడ్లు – 6, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్
►ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తరిగినవి)
►కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు – కొద్దికొద్దిగా
►మైదా పిండి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు (కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి)
► క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్ల చొప్పున ( అభిరుచిని బట్టి)
►నూనె – సరిపడా
తయారీ:
►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసుకుని బాగా కలపాలి.
►కళాయిలో నూనె వేసి ఆమ్లెట్‌లా వేసి.. నిమిషం పాటు కదపకుండా ఉంచాలి.
►అనంతరం గరిటెతో కలియతిప్పి.. బుర్జీలా చేసుకోవాలి.
►స్టవ్ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత అందులో పావు కప్పు బ్రెడ్ పౌడర్, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము వేసుకుని బాగా కలపాలి.
►కొద్దిగా ఉప్పు జోడించి.. బాల్స్‌లా చేసుకోవాలి.
►వాటిని మైదా పిండి పేస్ట్‌లో ముంచి.. మిగిలిన బ్రెడ్ పౌడర్‌లో దొర్లించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment