న్యూఢిల్లీ: గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగొస్తుందో అంతే వేగంగా ఓ యువతి తనను ప్రాంక్ చేసిన వ్యక్తిని చెడుగుడు ఆడేసుకుంది. చర్యకు ప్రతిచర్యగా అతను చేసిన పనికి వడ్డీతో సహా తిరిగిచ్చేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి సరదాగా గేమ్ ఆడుదామని యువతిని అడిగాడు. అందుకు ఆమె సరేనంది. ఆటంటే యువకుడు బాల్స్ తీసి యువతి వైపు విసిరేస్తాడు. ఆమె వాటిని తలతో నెట్టుతూ కింద గ్లాస్‌లో పడేయాలి. అలా ఆట మొదలైంది.. అతడు ఒకటి, రెండూ బంతులు వేశాడు. ఆమె ఏ ఒక్కటీ గ్లాసులో పడేయలేకపోయింది. ఇంకా తీక్షణంగా ఆడటం మొదలుపెట్టింది. (ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు)
ఇంతలో ఆ కొంటె యువకుడు బంతికి బదులు కోడి గుడ్డు విసిరాడు. అది నేరుగా వచ్చి ఆమె తలపై పలిగింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సదరు యువతి చేతికందిన వస్తువునల్లా అతడిపైకి బాణాల్లా విసిరేస్తూ తన ప్రతాపం చూపించింది. ఈ వీడియోను క్వారంటైన్ లైఫ్ పేరిట భారత వ్యాపారవేత్త హర్ష గొయాంక శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ భార్య ప్రతీకారానికి లైకులు, బలైన భర్తకు జాలి చూపిస్తూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'భారతీయులు మాత్రం దీన్ని ప్రయత్నించకండి, ఇలా చేస్తే కనీసం మనకు తిండి కూడా పెట్టరు' అంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. 'క్వారంటైన్ సమయంలో నేను చూసిన బెస్ట్ వీడియో' ఇది అంటూ మరొకరు కామెంట్ చేశారు. (చచ్చిన వ్యక్తి కోసం మూడు నెలలుగా..)
Comments
Please login to add a commentAdd a comment