సాక్షి, అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’లో కీలక పౌష్టికాహారమైన కోడిగుడ్లను మరింత నాణ్యంగా, తాజాగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోడిగుడ్లు సరఫరాలో, వాటి నిల్వలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించింది.
పాఠశాల విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై దీనిపై చర్చించారు. కోడిగుడ్ల నాణ్యతపై ప్రభుత్వం థర్డ్ పార్టీ ద్వారా చేయించిన పరిశీలనల నివేదికపై కూడా సమావేశంలో చర్చించారు. కోళ్ల ఫారాల నుంచి నేరుగా స్కూళ్లకు తాజా, నాణ్యమైన గుడ్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకనుంచి నెలకు నాలుగుసార్లు సరఫరా చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment