అటుకులు, కోడిగుడ్డుతో ఇలా రుచికరమైన వంటకం ఎగ్ పోహా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి.
ఎగ్ పోహా తయారీకి కావాల్సినవి:
►గుడ్లు – 2
►అటుకులు – 1 కప్పు (ముందుగా నీళ్లలో కడిగి, తొట్టెలో వేసుకుని వడకట్టుకోవాలి)
►నూనె – సరిపడా, కరివేపాకు రెమ్మలు – 3
►ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున
►పసుపు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా
►ఉప్పు – తగినంత
►కొత్తిమీర తరుగు – గార్నిష్ కోసం
ఎగ్ పోహా తయారీ విధానం
►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి.
►అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.
►అవన్నీ బాగా వేగిన తర్వాత.. కళాయి మధ్యలో ఖాళీ చేసి.. గుడ్లు పగలగొట్టి వేసుకుని.. పసుపు సొనను బాగా కలపాలి
►ఆమ్లెట్‌లా 2 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించి.. తర్వాత గరిటెతో అటూ ఇటూ కదిలిస్తూ.. ఇప్పుడు క్యాప్సికం మిశ్రమంతో కలిపి వేయించాలి.
►అనంతరం కారం, పసుపు, మిరియాల పొడి వేసుకుని తిప్పాలి.
►తర్వాత అటుకుల్ని వేసుకుని మరోసారి తిప్పి.. కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.
►ఆ కళాయిపై మూతపెట్టి 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
►అనంతరం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇవి కూడా ట్రై చేయండి: Kakori Kebab Recipe: మటన్ కీమా.. పచ్చిబొప్పాయి తరుగు.. కకోరి కబాబ్ తయారీ ఇలా!
Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్!
Comments
Please login to add a commentAdd a comment