గుడ్డుపై వాక్యూమ్‌ క్లీనర్‌ ప్రయోగించాడు! | Man Uses Vacuum Cleaner To Remove Extra Pepper From Egg | Sakshi
Sakshi News home page

గుడ్డుపై వాక్యూమ్‌ క్లీనర్‌ ప్రయోగించాడు!

Published Fri, Jul 24 2020 3:09 PM | Last Updated on Fri, Jul 24 2020 4:18 PM

Man Uses Vacuum Cleaner To Remove Extra Pepper From Egg - Sakshi

వంట చేసేట‌ప్పుడు ఎంత‌టి నిష్ణాతుల‌కైనా కొన్ని పొర‌పాట్లు త‌లెత్త‌డం స‌హ‌జం. ఒక్కోసారి చ‌క్కెర బ‌దులుగా ఉప్పు వేయ‌డం లాంటి త‌ప్పులు దొర్లుతుంటాయి. కొన్ని చిట్కాలు ఉప‌యోగించి దాన్ని స‌రిచేసే ప‌ద్ద‌తులూ ఉంటాయి. అయితే  ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ చేసిన వినూత్నంగా ఆలోచించాడు.  ఉడ‌క‌బెట్టిన గుడ్డును తిందామ‌నుకుంటే అందులో మిరియాల పొడి కాస్త ఎక్కువైంది. దీంతో వాక్యూమ్ క్లీన‌ర్‌తో ఎక్స్‌ట్రా పెప్ప‌ర్ను తీసేద్దాం అనుకొని వెరైటీగా ఆలోచించాడు. ఈ ఐడియా కాస్తా ఫెయిల్ అయ్యి చివ‌ర‌కు గుడ్డు పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఈ వీడియోను 7.1 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఐడియా ఫెయిలంయిదేమో కానీ బోలెడంత ఫ‌న్ క్రియేట్ అయ్యింది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. (40 అడుగుల ఎత్తు నుంచి దూకిన చిన్నారులు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement