IEC's new egg industry award to recognize innovation - Sakshi
Sakshi News home page

కోడిగుడ్ల ఆహారోత్పత్తులకు పురస్కారాలు! ఎగ్‌ ఇన్నోవేషన్‌ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం 

Published Mon, May 29 2023 8:35 AM | Last Updated on Mon, May 29 2023 12:47 PM

Egg Innovation Awards IEC new egg industry award to recognize innovation - Sakshi

హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ (ఐఈసీ) తాజాగా విజన్‌ 365 ఎగ్‌ ఇన్నోవేషన్‌ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కోడిగుడ్లతో చేసిన వినూత్న ఆహారోత్పత్తులకు గాను ఈ అవార్డును అందించనున్నట్లు విజన్‌ 365 చైర్మన్‌ సురేష్‌ చిట్టూరి తెలిపారు. ఈ కొత్త అంతర్జాతీయ పురస్కారానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.

నూతన ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు, వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆగస్టు 11లోగా కంపెనీలు తమ ఉత్పత్తుల వివరాలను షేర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 24–28 మధ్య జరిగే ఐఈసీ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement