200 Year Old Els Enfarinats Festival: ఇంతవరకు చాలా రకాల పండుగల గురించి విన్నాం. ప్రపంచంలో విభిన్న సంసృతులకు సంబంధించిన పండుగలు చాలానే ఉన్నాయి. జంతువులకు సంబంధించిన పండుగలే కాక బురదలో కొట్టుకోవడం, ఆవు పేడతో జరుపుకునే రకరకాల విచిత్రమైన పండుగులు గురించి విన్నాం. అయితే స్పెయిన్‌లో మాత్రం వాటన్నింటకి భిన్నంగా ఆహార పదార్థాలతో యుద్ధం చేసుకుంటూ పండుగను చేసుకుంటారట!.
(చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం)
అసలు విషయంలోకెళ్లితే....స్పెయిన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార యుద్ధంలో ఒకటిగా ఎల్స్ ఎన్ఫారినాట్స్ పండుగ ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను స్పెయిన్‌లోని ఐబి, అలికాంటే వంటి చిన్నపట్టణాల్లో ఏటా డిసెంబర్ 28న ఈ పండుగను జరుపుకుంటారు. ఎల్స్ ఎన్‌ఫారినాట్స్ అనేది రెండు గ్రూపుల మధ్య జరిగే తమాషా యుద్ధం. అయితే ఈ పండుగను పిండి, గుడ్డు వంటి వాటిని ఒకరి పై ఒకరు విసురుకుంటూ బాణాసంచాలు కాలుస్తు జరుపుకుంటారు.
అంతేకాదు ఈ పండుగ 200 ఏళ్లనాటి సంప్రదాయ పండుగ. ఇది బైబిల్ కథలోని అమాయకుల ఊచకోతకు సంబంధించిన నాటి చీకటి సంఘటనకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ పండుగను డే ఆఫ్ ఇన్నోసెన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రజలు నకిలీ సైనిక దుస్తులు ధరించి తిరుగుబాటు చేస్తున్నట్లుగా ఆడుతుంటారు. పైగా ఈ పండుగలో ఒక సముహం నగరాన్ని తమ హస్తగతం చేసుకునేలా తిరుగుబాటు చేస్తుంది.
ఆ తర్వాత వారికి వారే విచిత్రమైన చట్టాలను కూడా ఏర్పాటు చేసుకుని దండన వంటి శిక్షలు కూడా విధించుకుంటారు. ఆ తర్వాత ఈ పండుగ నుంచి సేకరించిన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తారు. ఈ మేరకు ఈ పండుగను ఐబీ నగరం 1862 కాలం నుండి ఈ సంప్రదాయ పండుగను జరుపుకుంటుంది. అయితే 1936-39లో స్పానిష్ అంతర్యుద్ధం సమయంలో స్పెయిన్ అంతటా యుద్ధం జరగడంతో ఈ పండుగను జరుపుకోలేదు. అలాగే నియంత జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో హత్య జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ పండుగను 1981 జరుపుకున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
(చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!)
Comments
Please login to add a commentAdd a comment