Flour
-
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
సంకలనాలు కలిగిన పిండి మిశ్రమాలు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. అవి తక్కువ పన్ను రేటు చట్టంలో పేర్కొనని ఆహార పదార్థాల తరగతి కిందకు వస్తాయని పేర్కొంది.ఇడ్లీ, ధోక్లా, దహీ వడ వంటి వంటకాలకు పిండి మిశ్రమాలను విక్రయించే గాంధీనగర్‌కు చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. ఈ పిండి మిశ్రమాలను 5 శాతం పన్ను రేటు ఉన్న కేటగిరీ కింద వర్గీకరించాలని కంపెనీ వాదించింది.చట్టంలో పేర్కొనని నిష్పత్తిలో మసాలా దినుసులు, ఇతర పదార్ధాలతో పిండి మిశ్రమాలు తక్కువ పన్ను రేటును క్లెయిమ్ చేయలేవని అథారిటీ మే 29న ఒక ఉత్తర్వులో తెలిపింది. గుజరాత్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ గతంలో ఇచ్చిన ముందస్తు తీర్పును ఈ నిర్ణయం సమర్థించింది. -
సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
గోధుమ పిండి, వరి పిండి, జోన్న పిండి ఇలా రకరకాల పిండులు గురించి విని ఉంటాం. కానీ ఇదేంటి సింఘారా పిండి అనుకోకండి. దీన్ని పూజల సమయాల్లో ఉపవాసంగా ఉన్నప్పుడూ ఎక్కువగా వినియోగిస్తారట. ఇది ఒక రకమైన పండు విత్తనం నుంచి తయారు చేసే పిండే సింఘారా. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..! సింఘారా లేదా వాటర్ కాల్ట్రాప్ లేదా వాటర్ చెస్ట్నట్ అనేది ఒక విధమైన పండు. ఇది నీటి అడుగున పెరిగే ఒక విధమైన పండు. చెప్పాలంటే ఇది శీతాకాలపు పండు. అయినప్పటికీ దానితో తయరు చేసే ఉత్పత్తుల్లో ముఖ్యంగా సింఘారా పిండి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఈ సింఘారా పండుని ఎండబెట్టి పిండిని తయారు చేస్తారు. ఈ పిండిన ముఖ్యంగా వ్రతాలు, పూజల సమయాల్లో తప్పనిసరిగా ఆహారంగా తీసుకుంటారు. అంత పవిత్రంగా భావిస్తారు ఈ సింఘారా పిండిని. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే గాక ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. శరీరంలో తగినంత నీరు ఉండేలా.. సింఘారా పిండిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.పైగా సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలో తగినంత నీరు ఉండేలా తోడ్పడుతుంది. ఎనర్జీకి.. సింఘారా పిండిలో మంచి కార్బోహైడ్రేట్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలకు అద్భుతమైన మూలం. నవరాత్రి ఉపవాస సమయంలో శక్తి స్థాయిలు తగ్గడం సహజం. ఎందుకంటే ఈ రోజుల్లో తీసుకునే ఆహారం మాములుగా సాధారణ రోజుల కంటే విభిన్నంగా ఉంటుంది. ఆ టైంలో సింఘారా పిండితో చేసిన పదార్థాలు తక్షణ శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పవర్‌హౌస్ సింఘారా పండ్లలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అనామ్లజనకాలు, ఖనిజాలు ఈ పిండిలో పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ చెస్ట్నట్ పిండిలో విటమిన్ B6, పొటాషియం (సగం కప్పుకు 350 నుంచి 360 mg), రాగి, రిబోఫ్లావిన్, అయోడిన్, మాంగనీస్ ఉన్నాయి. ఈ అయోడిన్, మాంగనీస్‌లు థైరాయిడ్ సమస్యలను రాకుండా చేస్తుంది. బరువు తగ్గడం సింఘారాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఈ పిండితో చేసిన ఆహారం తినడం వల్ల నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. తద్వారా ఇతర అధిక-కొవ్వు ఆహారాలను తినకుండా నిరోధిస్తుంది. ఈ ఫైబర్ ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. గ్లూటెన్ ఫ్రీ సింఘారా పిండి గ్లూటెన్ ఫ్రీ. ఇందులో గోధుమ, బార్లీ, వోట్స్‌లో ఉండే జిగురు ఉంటుంది. దీని వల్ల ఉదరకుహర వ్యాధులు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. (చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!) -
మిల్లెట్ల పిండిపై 5% పన్ను
న్యూఢిల్లీ: త్రుణ ధాన్యాల ఆధారిత పిండిపై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70 శాతం త్రుణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5 శాతం పన్ను ఉంటుందని వివరించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ)ప్రెసిడెంట్‌కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసెస్‌పై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని, 5 శాతానికి తగ్గించడంతోపాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు, ఆ విలువను కార్పొరేట్ గ్యారెంటీలో 1 శాతంగా పరిగణిస్తారు. దీనిపై జీఎస్టీ 18 శాతం విధించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. -
పాపం పాకిస్తానీలు.. గోధుమ పిండి కోసం ట్రక్కు వెనకాల పరుగులు...
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. తనడానికి తిండి కూడా సరిగా లేక ప్రజలకు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ దయనీయ పరిస్థితులకు అద్దం పట్టే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ టక్కు వెనకాల పరుగెత్తుతున్నారు పాకిస్తానీలు. బైక్‌లు వేసుకుని ర్యాలీగా దాన్ని ఫాలో అవుతున్నారు. తమకు ఓ పిండి బస్తా ఇవ్వమని చేతిలో డబ్బులు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు. This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing a truck carrying wheat flour, hoping to buy just 1 bag. Ppl of #JammuAndKashmir should open their eyes. Lucky not to be #Pakistani & still free to take decision about our future. Do we have any future with🇵🇰? pic.twitter.com/xOywDwKoiP — Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 14, 2023 ఈ వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్ముకశ్మీర్ గిల్గిత్ బాల్టిస్తాన్ అండ్ లద్దాఖ్ (జేకేజీబీఎల్) ఛైర్మన్ ప్రొఫెసర్ సజ్జాద్ రాజా ట్విట్టర్లో షేర్ చేశారు. ఒక్క పిండి బస్తా కోసం పాకిస్తాన్లో ప్రజలు ఎలా ట్రక్కు వెనకాల పరుగెత్తుతున్నారో చూడండి. దీన్ని చూసైనా జమ్ముకశ్మీర్ ప్రజలు కళ్లు తెరవాలి. వాళ్లు పాకిస్తాన్లో లేనందుకు అదృష్టవంతులు. మన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇంకా ఉంది. పాకిస్తాన్లో అసలు మనకు భవిష్యత్ ఉందా? అని ప్రశ్నించారు. లాహోర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 15 కిలోల గోధుమ పండి బస్తా ధర రూ.2,050 ఉంది. జనవరి 6నే బస్తాపై రూ.150 పెంచారు. ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చదవండి: ప్రపంచాన్ని చుట్టివచ్చిన వీరుడు.. వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు.. -
‘సింగపూర్‌లో చపాతీల కోసం భారతీయుల కటకట!’
సింగపూర్ పంజాబీలకు చపాతీ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఈ ఏడాది మే నెల నుంచి భారత్ గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. ముఖ్యంగా సింగపూర్ వంటి దేశాల్లో నార్త్ ఇండియా నుంచి ఎగుమతయ్యే గోధుమల రవాణా తగ్గిపోయింది. దీంతో ఆ గోధుమలతో తయారు చేసిన చపాతీలు లభ్యం కాకపోవడంతో వాటిని అమితంగా ఇష్టపడే పంజాబీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూడు రెట్లు ఎక్కువే ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం కారణంగా విదేశాల్లో గోధుమల కొరత తీవ్రంగా ఏర్పడింది. అవసరానికి అనుగుణంగా గోధుమలు లేకపోవడం, వాటిని ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న భారత్ ఎగుమతుల్ని నిలిపివేయడంతో సింగపూర్‌లో భారతీయులకు చపాతీల కొరత ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఆ చపాతీ పిండి కొనుగోలు చేయాలంటే భారత్‌తో పోలిస్తే మూడింతలు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరల భారాన్ని వినియోగదారులపై మోపడం కష్టంగా ఉందని సింగపూర్‌లో ఐదు రెస్టారెంట్ అవుట్ లెట్స్ నిర్వహిస్తున్న శకుంతలా రెస్టారెంట్ ప్రతినిధులు చెబుతున్నారు. కష్టంగా ఉంది సింగపూర్‌లో కేజీ గోధుమ పిండిని 2డాలర్లు చెల్లించే కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అదే కేజీ గోధుమ పిండి ధర 8డాలర్లకు చేరింది. గోధుమ పిండిని అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయడం కష్టంగా మారిందని పంజాబీ, బెంగాల్ వంటలకు ప్రసిద్ధి చెందిన మస్టర్డ్ సింగపూర్ రెస్టారెంట్ యజమాని రాధిక అబ్బి తెలిపారు. -
క్వాలిటీయే వారి బ్రాండ్.. అప్పాల తయారీ పైసలతోనే అమెరికాకు పిల్లలు
సాక్షి, పెద్దపల్లి: పెళ్లివేడుక.. సీమంతం పండు.. ఇలా ఏ శుభకార్యమైన ఇంట్లో పిండి వంటలు చేయడం తెలుగింటి కుటుంబాల్లో సాధారణం. పెరిగిన కార్పొరేట్ కల్చర్‌తో పెద్దఎత్తున అప్పాలు చేసే సమయం.. తీరిక లేకపోవడంతో శుభకార్యాలకు ఆర్డర్ ఇచ్చి అప్పాలు తయారుచేయించుకునే సంస్కృతి పెరిగిపోతోంది. దీనిని అవకాశంగా తీసుకున్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ మహిళలు. క్వాలిటీగా అప్పాలు చేయడాన్ని ఉపాధిగా మలుచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. లక్ష్మీ ఆలోచన అదుర్స్.. సుమారు పదిహేను ఏళ్ల క్రితం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ లీడర్‌గా పదిమంది సభ్యులతో గ్రూపుగా ఏర్పాటు చేసుకుని ఇంటివద్దనే ఉంటూ చిన్నమొత్తాలతో ఏమైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్‌లోని ఓ సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్ద మొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచ్చింది. దీంతో గ్రూప్ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. ‘ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని.. ఇక సిటీలో ఉన్నవారు పరిస్థితి ఏంటి..? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు..?’ అనే ఆలోచన లక్ష్మీకి తట్టింది. దీనిని ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్ సభ్యులకు వివరించింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు. చదవండి: మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం ఏడు గ్రూప్‌లు.. 350మంది వర్కర్లు తమ గ్రూపునకు ఎటువంటి పేరుగానీ.. బ్రాండ్గానీ లేకుండా క్వాలిటీతో మొదట తమ గ్రూప్ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్స్ మీద తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్స్ పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.60 లక్షలపైనే ఆర్డర్స్ వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి.. పిండి తయారీకి.. సకినాలు చుట్టడానికి.. ఇతరత్రా పనులకు రోజువారీ వర్క్‌ర్స్ సహాయం తీసుకుని వారికి ఉపాధి కల్పించారు. దీంతో వీరిని చూసి గ్రామంలో మరో ఆరు సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్‌లో పది మంది సభ్యులతో పాటు వారికి సహాయంగా పనికి వచ్చే 50మంది వర్క్‌ర్స్, పిండి గిర్నీ, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు కలిపి దాదాపు 300మందికి పైగా ఇప్పుడు ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు. బాహుబలి అప్పాలు.. 32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలూ, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్ద ఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత. వీరి అప్పాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతోపాటు, అమెరికా, ఇంగ్లాండ్, అస్ట్రేలియాలాంటి దేశాలకు సైతం ఆర్డర్స్ మీద సరఫరా చేస్తున్నారు. పిల్లలను అమెరికా పంపిన ఖాళీగా ఉండకుండా ఇంటిపట్టున ఉంటూ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆర్డర్ మీద అప్పాలు చేయాలన్న ఆలోచన వచ్చింది. ప్రత్యేకంగా బ్రాండ్ లేకుండానే తెలిసిన వారి నుంచి ఆర్డర్స్ తీసుకుని క్వాలిటీతో సమయానికి ఇవ్వడంతో రోజురోజుకూ ఆర్డర్స్ పెరిగాయి. అప్పాలు చేయడంతో వచ్చిన పైసలతోనే మా ఇద్దరు అమ్మాయిలను అమెరికా పంపించా. – తానిపత్తి లక్ష్మీ, గ్రూప్ లీడర్ పిల్లలు అమెరికాలో చదువుతున్నరు ఎండలో పనికి పోకుండా.. ఇంటి పట్టునే ఉంటూ ఆర్థికంగా ఇంటికి ఆసరా అవుతున్నం. చదువుల కోసం పిల్లల్ని విదేశాలకు పంపే స్థితికి వచ్చాం. మా గ్రూప్‌ను చూసి గ్రామంలో మరో ఆరు గ్రూప్‌లు ఏర్పాడ్డాయి. వీటిమీద ఆధారపడి మరో 300 మంది వరకు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి రోజు కూలీ రూ.500పైనే పడుతోంది. అర్డర్స్ ఎక్కువ వస్తే ఇతర గ్రూప్‌లతో పంచుకుంటాం. – సుభాషిణి, సభ్యురాలు రోజుకు రూ.500పైనే కూలీ నీడ పట్టున ఉంటూ అప్పాలు తయారు చేయడానికి పనికి వస్తుంట. 32 వరుసల సకినం చుట్టితే ఒక్కోదానికి రూ.20 ఇస్తారు. రోజుకు రూ.500 పైనే కూలీ పడుతుంది. తెల్లారేవరకు అందరితో సరాదాగా పనిచేస్తూ మా పిల్లలను మంచిగా చదివిస్తున్నా. వృద్ధులు సైతం వచ్చి పనిచేసుకుంటూ సొంత కాళ్ల మీద బతుకుతున్నారు. – రాజేశ్వరి, సహాయకురాలు -
పిండి, కోడి గుడ్లతో తమాషా యుద్ధం!!
-
పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా?
200 Year Old Els Enfarinats Festival: ఇంతవరకు చాలా రకాల పండుగల గురించి విన్నాం. ప్రపంచంలో విభిన్న సంసృతులకు సంబంధించిన పండుగలు చాలానే ఉన్నాయి. జంతువులకు సంబంధించిన పండుగలే కాక బురదలో కొట్టుకోవడం, ఆవు పేడతో జరుపుకునే రకరకాల విచిత్రమైన పండుగులు గురించి విన్నాం. అయితే స్పెయిన్‌లో మాత్రం వాటన్నింటకి భిన్నంగా ఆహార పదార్థాలతో యుద్ధం చేసుకుంటూ పండుగను చేసుకుంటారట!. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) అసలు విషయంలోకెళ్లితే....స్పెయిన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార యుద్ధంలో ఒకటిగా ఎల్స్ ఎన్ఫారినాట్స్ పండుగ ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను స్పెయిన్‌లోని ఐబి, అలికాంటే వంటి చిన్నపట్టణాల్లో ఏటా డిసెంబర్ 28న ఈ పండుగను జరుపుకుంటారు. ఎల్స్ ఎన్ఫారినాట్స్ అనేది రెండు గ్రూపుల మధ్య జరిగే తమాషా యుద్ధం. అయితే ఈ పండుగను పిండి, గుడ్డు వంటి వాటిని ఒకరి పై ఒకరు విసురుకుంటూ బాణాసంచాలు కాలుస్తు జరుపుకుంటారు. అంతేకాదు ఈ పండుగ 200 ఏళ్లనాటి సంప్రదాయ పండుగ. ఇది బైబిల్ కథలోని అమాయకుల ఊచకోతకు సంబంధించిన నాటి చీకటి సంఘటనకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ పండుగను డే ఆఫ్ ఇన్నోసెన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రజలు నకిలీ సైనిక దుస్తులు ధరించి తిరుగుబాటు చేస్తున్నట్లుగా ఆడుతుంటారు. పైగా ఈ పండుగలో ఒక సముహం నగరాన్ని తమ హస్తగతం చేసుకునేలా తిరుగుబాటు చేస్తుంది. ఆ తర్వాత వారికి వారే విచిత్రమైన చట్టాలను కూడా ఏర్పాటు చేసుకుని దండన వంటి శిక్షలు కూడా విధించుకుంటారు. ఆ తర్వాత ఈ పండుగ నుంచి సేకరించిన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తారు. ఈ మేరకు ఈ పండుగను ఐబీ నగరం 1862 కాలం నుండి ఈ సంప్రదాయ పండుగను జరుపుకుంటుంది. అయితే 1936-39లో స్పానిష్ అంతర్యుద్ధం సమయంలో స్పెయిన్ అంతటా యుద్ధం జరగడంతో ఈ పండుగను జరుపుకోలేదు. అలాగే నియంత జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో హత్య జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ పండుగను 1981 జరుపుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!) -
నువ్వుల్.. నవ్వుల్
‘పండుగ రోజు నువ్వులుండాలి!’ ‘అదేంటండీ! పండుగ రోజు ఉండాల్సింది నవ్వులు కదండీ!’ ‘అరే! నువ్వులుంటే... నవ్వులుంటాయ్రా భాయ్’ ‘చెవిలో పువ్వులుండవా?’ ‘ద్వారానికి పువ్వులు... ఇంట్లో పిండి వంటలు... వాటిలో నువ్వులు... ఇంటిల్లపాదీ ఆరోగ్యాల నవ్వులు...’ ‘భలేగా పిండికొట్టి మరీ చెప్పావోయ్! పిండివంటల్లో నువ్వులుంటే... ఆరోగ్యాల నవ్వులన్నమాట!’ నువ్వుల కజ్జికాయలు కావల్సినవి: మైదా/గోధుమపిండి – కేజీ, నువ్వులు – కేజీ, బెల్లం – 800 గ్రాములు, ఏలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – వంద గ్రాములు, నెయ్యి/నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా పిండిని మెత్తగా చపాతీలకు కలుపుకున్నట్టు కలుపుకొని, పక్కన ఉంచాలి. నువ్వులను దోరగా వేయించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. ∙పిండిని పూరీ చేయడానికి తగినంత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక్కొక్క ఉండను ఒత్తాలి. దానిని మౌల్డ్‌లో లేదా చేతి మీద వేసుకొని నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని పెట్టాలి. తర్వాత చివర్లను మూసివేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది. ఇలా చేసుకున్న అన్ని కజ్జికాయలను కాగుతున్న నూనెలో వేసి, దోరగా వేగనివ్వాలి. కజ్జికాయలు చేయడానికి మౌల్డ్, వెనుక చక్రం ఉండే స్పూనులను వాడచ్చు. సకినాలు కావల్సినవి: బియ్యం– కప్పు, వాము – టీ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత తయారీ: రాత్రిపూట బియ్యం కడిగి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే నీళ్లు వంపేసి, బియ్యాన్ని పిండి చేయాలి. ఈ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. అలాగే దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా చేయాలి. ఈ పిండి చేత్తో పట్టుకుంటే మృదువుగా ఉండాలి. శుభ్రమైన కాటన్ క్లాత్‌ని పరిచి, పిండి తీసుకొని చేత్తోనే చక్రాల్లా చుట్టాలి. పది, పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించి, తీయాలి. నువ్వుల ఉండలు కావల్సినవి: నువ్వులు – అర కిలో, బెల్లం – 400 గ్రాములు, ఏలకుల పొడి – టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ: తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ నువ్వుల ఉండలకు వాడచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు పోయేటట్లు చేసుకోవాలి. లేదంటే అలాగే కూడా వాడుకోవచ్చు. నువ్వులను వేయించి పొడి చేయాలి. కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి. లేదా కాస్త పలుకుగా ఉండేట్లు దంచాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి – రెండూ కలిసే వరకు రోట్లో దంచాలి. చేతికి నెయ్యి రాసుకుని కావల్సిన సైజులో ఉండలు చేయాలి. కావాలంటే నువ్వులలో వేరుసెనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని విడిగా వేయించి, పొడి చేసి కలపాలి. అరిసెలు కావల్సినవి: బియ్యం– కేజీ, బెల్లం – 800 గ్రాములు, నువ్వులు – తగినన్ని, నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత తయారి: ∙అరిసెలు చేయడానికి ముందు రోజు నుంచే కావల్సినవి సిద్ధం చేసుకోవాలి. బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను ఒంపేసి, తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. ఈ పిండి ఆరిపోకుండా, గాలి తగలకుండా ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పెద్ద పాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాక మరగనిచ్చి, బియ్యప్పిండి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ∙బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకం పిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్టు నిమ్మకాయంత ముద్దలు తీసుకొని నువ్వులలో అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. అప్పుడు పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి దోరగా రెండువైపులా వేయించాలి. తర్వాత తీసి అరిసెల పీట మీద వేసి, నూనె కారిపోయేటట్లు ఒత్తాలి. అరిసెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు ఒత్తేయవచ్చు. అరిసె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడు బియ్యప్పిండి కలుపుకోవాలి.గట్టిగా, ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకాన్ని ముదరనివ్వాలి. ∙ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూన్‌తో కొద్దిగా తీసుకొని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. ఆ రౌండ్‌ని పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ రౌండ్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చేదాకా మరగనివ్వాలి. ఇలా చేసుకున్న అరిసెలు 15 రోజుల వరకు ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్నని సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిసెలాగ వేడిగా, మెత్తగా వస్తాయి. జంతికలు, కారప్పలు కావల్సినవి: బియ్యప్పిండి – 3 కప్పులు, సెనగపిండి – కప్పు, పుట్నాల పప్పు∙– పావు కప్పు, వెన్న – పావు కప్పు (కరిగించాలి), కారం – టీ స్పూన్, ఉప్పు – తగినంత, నువ్వులు– 2 టీ స్పూన్లు, జీలకర్ర– టీ స్పూన్, నూనె – తగినంత తయారీ: ∙పుట్నాల పప్పు వేయించి, పొడి చేయాలి. బియ్యప్పిండి, సెనగపిండి, పుట్నాల పప్పు పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, పిండి ముద్ద చేయాలి. పిండి మృదువుగా అయ్యేంత వరకు కలపాలి. ∙జంతికల అచ్చులో పిండి పెట్టి, పేపర్ మీద మురుకులు ఒత్తి, నూనెలో వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. (పైవన్నీ కలిపి, పూరీలా చేసి, నూనెలో రెండువైపులా కాల్చి తీస్తే కారప్పలు సిద్ధం.) -
అట్టును అచ్చొత్తేస్తుంది...
అట్టును అచ్చొత్తడమేంటనుకుంటున్నారా..? నిజంగా ఇది నిజం. ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చిత్ర విచిత్ర విలక్షణ వంటింటి పరికరం అట్టునే కాదు, రొట్టెను కూడా అచ్చంగా అచ్చొత్తేస్తుంది. మనం కోరుకునే అట్టుకైనా, రొట్టెకైనా పిండిని మాత్రం మనమే మకూర్చుకోవాలనుకోండి. ఎంతైనా ‘పిండి కొద్దీ రొట్టె’ అనే సామెత ఉండనే ఉంది కదా! ఈ పరికరం పైభాగాన ఉన్న గొట్టంలో సమపాళ్లలో కలుపుకున్న పిండిని దట్టించాలి. ఆ తర్వాత దీనికి పని చెప్పాలి. అదెలాగంటారా? ఇది కంప్యూటర్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. మనం కోరుకున్న చిత్రాన్ని కంప్యూటర్లో ఎంచుకుని, ఆ సమాచారాన్ని దీనికి చేరవేస్తే చాలు. నిమిషాల్లోనే మనం కోరుకున్న చిత్రం ఆకారంతో అట్టును అచ్చొత్తేస్తుంది. ఈఫిల్ టవర్ ఆకారంలో అచ్చొత్తుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఎంపిక చేసుకున్న ఫొటోలే కాదు, మనం గీసిన బొమ్మలను స్కాన్‌చేసి, కంప్యూటర్లోకి ఎక్కించి, వాటి ఆకారాలతో కూడా ఈ పరికరం సాయంతో రొట్టె, అట్టాదులను అచ్చొత్తేసుకుని ఇంచక్కా ఆరగించవచ్చు. దీనిపేరు ‘పాన్కేక్బో’. త్రీడీ ప్రింటింగ్ రోబోటిక్స్ పరిజ్ఞానంతో పనిచేస్తుంది ఇది. కోరుకున్న పాన్కేక్లకు రంగులు అద్దాలనుకునే వారు ఇందులో పిండితో పాటు ఫుడ్ కలర్స్‌ను కూడా చేర్చుకుంటే సరిపోతుంది. -
వరద పరవళ్లు..
తాలిపేరు ఏడు గేట్లు ఎత్తివేత– పర్ణశాల వద్దకు చేరిన జలం దుమ్ముగూడెం/బూర్గంపాడు/పాల్వంచ రూరల్/చర్ల: గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. పర్ణశాల, దుమ్ముగూడెం వద్ద పరవళ్లు తొక్కుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి పెరుగుతూ..గోదావరి ఆదివారం సాయంత్రానికి ఉధృతంగా మారింది. దుమ్ముగూడెం వద్ద 18 అడుగుల నీటిమట్ట నమోదైంది. పర్ణశాల వద్దకు జలం చేరడంతో..సీతమ్మ నారచీరలు, పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. చర్ల మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి కొనసాగుతుండడంతో..ప్రాజెక్ట్ ఏడు గేట్లను ఎత్తారు. 23, 600 క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బూర్గంపాడు మండలంలోని పెదవాగు, ఎదుర్లవాగు, కిన్నెరసానిలకు వరద భారీగా చేరుతోంది. పాల్వంచ వద్ద గల కిన్నెరసానిలోకి వరద పోటెత్తుతోంది. మొత్తం 407అడుగుల నీటి నిల్వ సామర్థ్యానికి 405.70 అడుగులకు నీటినిల్వ చేరింది. ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తనున్నట్లు డ్యామ్‌సైడ్ కేటీపీఎస్ ఈఈ ఉప్పలయ్య తెలిపారు. -
మొదలెడితే ఆపమ్...
ఆప్పమ్ కావల్సినవి బియ్యం - అర కేజీ, పంచదార - చిటికెడు; ఉప్పు - తగినంత, ఈస్ట్ - టేబుల్ స్పూన్ (మార్కెట్లో రెడీ మేడ్ ఈస్ట్ లభిస్తుంది); ఇంట్లోనే ఈస్ట్ తయారీ: పావు కప్పు మైదా, టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ సోంపు పొడి తీసుకొని తగినన్ని వేడి నీళ్లు పోసి దోసె పిండిలా బాగా కలపాలి. దాదాపు ఒక రోజంతా ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచితే పైన బుడగల్లా వస్తాయి. ఇలా తయారుచేసుకున్న దానినే ఈస్ట్ అంటారు. ఫ్రిజ్‌లో పెట్టి 7 రోజుల వరకు దీనిని వాడుకోవచ్చు) తయారీ రాత్రి పూట బియ్యం కడిగి, నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బియ్యం మెత్తగా దోసె పిండిలా రుబ్బుకోవాలి.ఈ పిండిలో ఈస్ట్, పంచదార కలపాలి. తర్వాత ఉప్పు కలిపి ఆపమ్ కడాయిలో వేసి, ఉడికించి, బయటకు తీయాలి. (నాన్‌స్టిక్ కడాయిని కూడా వాడుకోవచ్చు) దీనికి కొబ్బరిపాలు, కాయ్ స్టూ వడ్డించాలి. కాయ్ స్టూ కావల్సినవి క్యారట్ - 50 గ్రా.లు, బీన్స్ - 50 గ్రా., బంగాళదుంపలు - 80 గ్రా.లు , బఠాణీలు - 30 గ్రా.లు, పచ్చిమిర్చి - 3, అల్లం తరుగు - టేబుల్ స్పూన్, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు - 4, యాలకులు - 4, బిర్యానీ ఆకు - ఒకటి, కరివేపాకు - 1, కొబ్బరి నూనె - 30 ఎం. ఎల్, కొబ్బరి పాలు - 400 ఎం.ఎల్, మిరియాలు - టీ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత తయారీ గిన్నెలో కొబ్బరి నూనె వేడి చేసి, మిరియాలు, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, మధ్యకు కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారట్, బంగాళదుంప ముక్కలు, పచ్చిబఠాణీలు, బీన్స్ వేసి వేగించాలి. దీంట్లో కొబ్బరి పాలు పోసి మిశ్రమం చిక్కబడేంతవరకు ఉడికించాలి.అన్నీ సరిపడా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఆపమ్కి కాంబినేషన్‌గా వడ్డించాలి. మలబార్ పరాటా కావల్సినవి మైదా - అర కేజీ, పాలు - 100 ఎం.ఎల్; ఉప్పు - తగినంత, పంచదార - తగినంత, నూనె - 100 ఎం.ఎల్, నీళ్లు -తగినన్ని తయారీ మైదాలో ఉప్పు, పంచదార వేసి కలపాలి.దీంట్లో పాలు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మూత పెట్టి అరగంట వదిలేయాలి.పిండిని సమ భాగాలు చేసుకొని ఉండలు చేయాలి. కొద్దిగా నూనె అద్దుకుంటూ పిండిని చపాతీలా చేసుకోవాలి. దీన్ని చుట్టలా చుట్టి, మళ్లీ గుండ్రటి ముద్దలా చేసుకోవాలి.ఇలా తయారుచేసుకున్నదాన్ని మళ్లీ చపాతీలా వత్తి, పెనం మీద నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. రెండువైపులా కాల్చుకున్నాక ఈ పరాటాలు పొరలు పొరలుగా వస్తాయి. ఏదైనా గ్రేవీ కర్రీతో వీటిని వడ్డించవచ్చు. నెయ్ చోరు కావల్సినవి బియ్యం - 250 గ్రా.లు, సోంపు - టీ స్పూన్, నెయ్యి - 50 ఎంఎల్, యాలకులు- 5, దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 5, బిర్యానీ ఆకు - 1, ఉల్లిపాయల తరుగు - 50 గ్రా.లు, పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి), కరివేపాకు - 1 రెమ్మ, పాలు - 50 ఎం.ఎల్, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినన్ని తయారీ: బియ్యాన్ని కడిగి, నానబెట్టాలి గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో సోంపు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బియ్యం వడకట్టి అందులో వేసి కలపాలి. దీంట్లో పాలు, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కలపాలి. అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి సరిచూసుకొని అన్నం పూర్తిగా ఉడికాక దించాలి. కోళి వర్తద్ కావల్సినవి చికెన్ బోన్‌లెస్- అర కేజీ, కొబ్బరి నూనె - 80 ఎం.ఎల్, సోంపు - టీ స్పూన్, గరం మసాలా - 15 గ్రా.లు, ఉల్లిపాయల తరుగు - 100 గ్రా.లు, టొమాటో ముక్కలు - 180 గ్రా.లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 12. గ్రా.లు, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, మిరియాల పొడి - చిటికెడు, కరివేపాకు - 1, ఉప్పు - తగినంత, కొబ్బరి తరుగు - 50 గ్రా.లు తయారీ చికెన్‌ను శుభ్రపరిచి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం వేసి కలిపి పక్కన ఉంచాలి.కొబ్బరి నూనె వేడి చేసి అందులో సోంపు, గరం మసాలా, ఉల్లిపాయలు వేసి వేయించాలి. దీంట్లో టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి.దీంట్లో చికెన్ ముక్కలు, కరివేపాకు వేసి కలిపి ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత ఉప్పు, కొత్తిమీర, కొబ్బరి తరుగు వేసి వేడి వేడిగా వడ్డించాలి. ఎరచి ఉలర్తియదు కావల్సినవి మటన్ - 500 గ్రా.లు, కొబ్బరి నూనె - 80 ఎం.ఎల్, సోంపు - 10 గ్రా.లు, ఉల్లిపాయ తరుగు - 150 గ్రా.లు, కొబ్బరి తరుగు - 50 గ్రా.లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 30 గ్రా.లు, కరివేపాకు - ఒకటి, పసుపు - అర టీ స్పూన్, ధనియాల పొడి - 30 గ్రా.లు, కారం - టేబుల్ స్పూన్, మసాలా - అర టీ స్పూన్, తరిగిన టొమాటో - కప్పు తయారీ మటన్‌ను శుభ్రపరిచి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు కలిపి పక్కన ఉంచాలి.కొబ్బరి నూనె వేడి చేసి అందులో సోంపు, ఉల్లిపాయలు వేసి వేగించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ వేసి కలిపి, కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. మటన్ ముప్పావు వంతు ఉడికాక అందులో టొమాటో తరుగు, మిగిలిన మసాలా పొడులు వేసి ఉడకనివ్వాలి,. మటన్ ఉడికాక కరివేపాకు, కొబ్బరి తురుము వేసి వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి. పరుప్పు ప్రదమన్ కావల్సినవి పెసరపప్పు - పావు కేజీ, బెల్లం - 400 గ్రా.లు, నెయ్యి - 100 గ్రా.లు, జీడిపప్పు - 50 గ్రా.లు, కొబ్బరి తరుగు - 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూన్, జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు తయారీ కడాయిలో సగం నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించుకోవాలి బెల్లంలో కప్పు నీళ్లు పోసి, కరిగించాలి బెల్లం నీళ్లలో వేయించిన పెసరపప్పు వేసి ఉడికించాలి పప్పు ఉడికాక, కొబ్బరి పాలు పోయాలి కడాయిలో మిగతా సగం నెయ్యి వేసి జీడిపప్పు, కొబ్బరి తరుగు వేయించి ప్రదమన్లో కలపాలి. చివరగా యాలకుల పొడి వేసి దించాలి. కప్పులో పోసి వేడి వేడిగా అందించాలి. కావాలనుకుంటే దీంట్లో కిస్మిస్, బాదంపప్పులు కూడా వేసుకోవచ్చు. ప్రయోగశాల వంటగది ప్రయోగశాల వంటిది. శుచి, శుభ్రత పాటిస్తేనే పదార్థాల రుచి, మన ఆరోగ్యం పెరుగుతాయి.వంటకంలో పదార్థాలు ఎంత తాజాగా ఉంటే ఆ వంట అంత రుచిగా ఉంటుంది నేటి రోజుల్లో అన్ని కాయ గూరలు, పండ్లు అన్ని కాలాల్లోనూ దొరుకుతున్నాయి. కానీ, రుచి మాత్రం ఉండటం లేదు పదార్థాలను కాలాను గుణంగా వాడితేనే వాటి రుచి, ప్రయోజనాలు మనకు అంతగా అందుతాయి. మిక్సీలో కన్నా పిండి, పచ్చళ్లు రోట్లో నూరితే రుచి పెరగడానికి కారణం మన చేతి స్పర్శ. కరె్టిసీ: సింప్లీ సౌత్ బై షెఫ్ చలపతి రావు, ఫిల్మ్‌నగర్, హైదరాబాద్ -
వెజ్జీ బజ్జీ
బంగాళాఖాతంలో వాయుగుండం... అల్పపీడనం... హోరున గాలి... జోరున వాన... ఇంకేముంది... నాలుక ఒక్కసారిగా ఒళ్లు విదిల్చింది... వాసన... వాసన... అంటూ నాసికా రంధ్రాలు పెద్దవయ్యాయి... వంట గదిలో పిండి, కూరలు కంటికి ఇంపుగా కనిపించాయి... మరో కుంభకర్ణుడు, మరో ఘటోత్కచుడు ఆవహించారు... అంతే... ఈ రోజు బజ్జీలు పెట్టు అంది ఉదరం... ఆలస్యం దేనికి... వెజ్జీ బజ్జీలు చేసుకుని మనం కూడా నాలుకకు విందు చేద్దాం! బ్రెడ్ బజ్జీ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 3 (త్రికోణాకారంలో కట్ చేయాలి); సెనగ పిండి - కప్పు; మైదా పిండి - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ఉప్పు - తగినంత; నల్ల ఉప్పు పొడి - చిటికెడు; కారం - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చి మిర్చి - 4; నూనె - వేయించడానికి తగినంత; ఆమ్చూర్ పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, త్రికోణాకారంలో కట్ చేసిన బ్రెడ్ ముక్కలను బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి. టొమాటో బజ్జీ కావలసినవి: టొమాటోలు - 6 (బెంగళూరు టొమాటోలు, చిన్న సైజువి); పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; వంట సోడా - కొద్దిగా; నూనె - వేయించడానికి తగినంత; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - కప్పు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; నిమ్మరసం - టీ స్పూను; ఉల్లి తరుగు - టేబుల్ స్పూను; పల్లీలు - అర కప్పు తయారీ: టొమాటోలను శుభ్రంగా కడగాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, టొమాలోలను పిండిలో ముంచి, నూనెలో వేసి దోరగా వేయించాలి కరివేపాకు, కొత్తిమీరలను సన్నగా తరగాలి ఒక పాత్రలో ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, నిమ్మ రసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి బజ్జీలను మధ్యకు కొద్దిగా కట్ చేసి, ఉల్లితరుగు మిశ్రమం కొద్దిగా ఉంచి, ఆ పైన రెండు పల్లీలు ఉంచి, వేడివేడిగా అందించాలి. వంకాయ బజ్జీ కావలసినవి : వంకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత; స్టఫింగ్ కోసం... వాము - టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; సెనగ పిండి - టేబుల్ స్పూను తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా నాలుగు పక్షాలుగా తరిగి పక్కన ఉంచాలి (కాయలను ఉప్పు వేసిన నీటిలో ఉంచాలి. లేదంటే నల్లబడతాయి) ఒక పాత్రలో వాము, చింతపండు గుజ్జు, సెనగ పిండి గుజ్జు వేసి బాగా కలిపి, వంకాయలలో స్టఫ్ చేయాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక వంకాయలను జాగ్రత్తగా విడిపోకుండా పట్టుకుని పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం బజ్జీల మీద చల్లాలి సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి. బీరకాయ బజ్జీ కావలసినవి: బీరకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత తయారీ: ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కు తీసి చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక బీరకాయ చక్రాలను పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం చల్లాలి సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి. క్యాలీఫ్లవర్ బజ్జీ కావలసినవి: సెనగ పిండి - కప్పు బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (క్యాలీఫ్లవర్ని పువ్వులు పువ్వులుగా విడదీసి, గోరు వెచ్చని నీళ్లలో కడిగి పక్కన ఉంచాలి) తయారీ: ముందుగా ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, క్యాలీ ఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి హాట్ అండ్ స్వీట్ సాస్‌తో సర్వ్ చేయాలి. ఉల్లి బజ్జీ కావలసినవి: ఉల్లిపాయలు - 3 (తొక్క తీసి సన్నగా చక్రాల్లా తరగాలి), సెనగ పిండి - కప్పు, మైదా పిండి - టీ స్పూను, వంట సోడా - కొద్దిగా, ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు పొడి - చిటికెడు, కారం - టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట, పచ్చి మిర్చి - 4, నూనె - వేయించడానికి తగినంత, ఆమ్చూర్ పొడి - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, ఉల్లి చక్రాలు బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి. - సేకరణ: డా. ైవె జయంతి, సాక్షి, చెన్నై