గోధుమ పిండి, వరి పిండి, జోన్న పిండి ఇలా రకరకాల పిండులు గురించి విని ఉంటాం. కానీ ఇదేంటి సింఘారా పిండి అనుకోకండి. దీన్ని పూజల సమయాల్లో ఉపవాసంగా ఉన్నప్పుడూ ఎక్కువగా వినియోగిస్తారట. ఇది ఒక రకమైన పండు విత్తనం నుంచి తయారు చేసే పిండే సింఘారా. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..!
సింఘారా లేదా వాటర్ కాల్ట్రాప్ లేదా వాటర్ చెస్ట్‌నట్ అనేది ఒక విధమైన పండు. ఇది నీటి అడుగున పెరిగే ఒక విధమైన పండు. చెప్పాలంటే ఇది శీతాకాలపు పండు. అయినప్పటికీ దానితో తయరు చేసే ఉత్పత్తుల్లో ముఖ్యంగా సింఘారా పిండి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఈ సింఘారా పండుని ఎండబెట్టి పిండిని తయారు చేస్తారు. ఈ పిండిన ముఖ్యంగా వ్రతాలు, పూజల సమయాల్లో తప్పనిసరిగా ఆహారంగా తీసుకుంటారు. అంత పవిత్రంగా భావిస్తారు ఈ సింఘారా పిండిని. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే గాక ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
శరీరంలో తగినంత నీరు ఉండేలా..
సింఘారా పిండిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.పైగా సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలో తగినంత నీరు ఉండేలా తోడ్పడుతుంది.
ఎనర్జీకి..
సింఘారా పిండిలో మంచి కార్బోహైడ్రేట్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలకు అద్భుతమైన మూలం. నవరాత్రి ఉపవాస సమయంలో శక్తి స్థాయిలు తగ్గడం సహజం. ఎందుకంటే ఈ రోజుల్లో తీసుకునే ఆహారం మాములుగా సాధారణ రోజుల కంటే విభిన్నంగా ఉంటుంది. ఆ టైంలో సింఘారా పిండితో చేసిన పదార్థాలు తక్షణ శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పవర్‌హౌస్
సింఘారా పండ్లలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అనామ్లజనకాలు, ఖనిజాలు ఈ పిండిలో పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ చెస్ట్‌నట్ పిండిలో విటమిన్ B6, పొటాషియం (సగం కప్పుకు 350 నుంచి 360 mg), రాగి, రిబోఫ్లావిన్, అయోడిన్, మాంగనీస్ ఉన్నాయి. ఈ అయోడిన్, మాంగనీస్‌లు థైరాయిడ్ సమస్యలను రాకుండా చేస్తుంది.
బరువు తగ్గడం
సింఘారాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఈ పిండితో చేసిన ఆహారం తినడం వల్ల నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. తద్వారా ఇతర అధిక-కొవ్వు ఆహారాలను తినకుండా నిరోధిస్తుంది. ఈ ఫైబర్ ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
గ్లూటెన్ ఫ్రీ
సింఘారా పిండి గ్లూటెన్ ఫ్రీ. ఇందులో గోధుమ, బార్లీ, వోట్స్‌లో ఉండే జిగురు ఉంటుంది. దీని వల్ల ఉదరకుహర వ్యాధులు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment