సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది.
మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25.50 లక్షలు పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంలో గణపతి ప్రసాదాన్ని దక్కించుకున్నారు
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment