
జీడిమెట్ల: గణేష్ లడ్డూతో పాటు రూ.24 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు చోరీకి గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాష్ నగర్ డివిజన్ డీపీ కాలనీలో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేశారు.
మంగళవారం రాత్రి మండపంలోకి ప్రవేశించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు గణపతి వద్ద ఉన్న 8,2 కిలోల లడ్డూతో పాటు అక్కడే నిద్రిస్తున్న వారి జేబుల్లో రూ.24 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. యూత్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరీష్ తెలిపారు. కాగా లడ్డూను ఎత్తుకెళ్తున్న వ్యక్తి ఫొటో సీసీ కెమెరాకు చిక్కింది.
Comments
Please login to add a commentAdd a comment