ఆడి ఆర్‌ఎస్‌ 7 స్పోర్ట్‌బ్యాక్‌ | Audi Sport Back RS7 Launch in India | Sakshi
Sakshi News home page

ఆడి ఆర్‌ఎస్‌ 7 స్పోర్ట్‌బ్యాక్‌

Published Fri, Jul 17 2020 6:21 AM | Last Updated on Fri, Jul 17 2020 6:21 AM

Audi Sport Back RS7 Launch in India - Sakshi

ముంబై: లగ్జరీ కార్లు తయారు చేసే జర్మనీ కంపెనీ ఆడి కొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆర్‌ఎస్‌ 7 స్పోర్ట్‌బ్యాక్‌ పేరుతో అందిస్తున్న ఈ ఐదు సీట్ల కారు ధర రూ.1.94 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారు కోసం బుకింగ్స్‌ను గత నెల 23నే ప్రారంభించామని, వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలుపెడతామని ఆడి ఇండియా తెలిపింది. వీ8 ట్విన్‌–టర్బో 4–లీటర్ల టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకోగలదని పేర్కొంది.   మెర్సిడెస్‌–ఏఎమ్‌జీ ఈ 63 ఎస్, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5 కార్లకు ఈ కొత్త ఆడి కారు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement