Sport Back Model
-
ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్
ముంబై: లగ్జరీ కార్లు తయారు చేసే జర్మనీ కంపెనీ ఆడి కొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ పేరుతో అందిస్తున్న ఈ ఐదు సీట్ల కారు ధర రూ.1.94 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారు కోసం బుకింగ్స్‌ను గత నెల 23నే ప్రారంభించామని, వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలుపెడతామని ఆడి ఇండియా తెలిపింది. వీ8 ట్విన్–టర్బో 4–లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకోగలదని పేర్కొంది. మెర్సిడెస్–ఏఎమ్‌జీ ఈ 63 ఎస్, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కార్లకు ఈ కొత్త ఆడి కారు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆడి ఆర్ఎస్ 7 @ రూ.1.40 కోట్లు
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి సూపర్ స్పోర్ట్స్ ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్లో తాజా వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.1.40 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై, ఢిల్లీ). గత ఏడాది మార్కెట్లోకి తెచ్చిన ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌కు మంచి స్పందన లభించిందని, ఈ తాజా వెర్షన్లో 4 లీటర్ల వీ8 ఇంజిన్(ట్విన్ టర్బో వీ8 4.0)ను అమర్చామని కంపెనీ తెలిపింది. హైబ్రిడ్ అల్యూమినియం డిజైన్‌తో ఈ కారును రూపొందించామని ఫలితంగా ఉక్కుతో తయారు చేసే కారు కంటే ఇది 15 శాతం బరువు తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ కారులో ఆడి మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 100 కిమీ.కు 9.8 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని వివరించింది.