ఆడి నుంచి ఈ - ట్రోన్‌ ఎస్‌యూవీ | Audi E-ron Eectric SUV Arrives At Showrooms | Sakshi
Sakshi News home page

ఆడి నుంచి ఈ - ట్రోన్‌ ఎస్‌యూవీ

Published Sun, Jun 13 2021 11:03 AM | Last Updated on Sun, Jun 13 2021 11:32 AM

Audi E-ron Eectric SUV Arrives At Showrooms  - Sakshi

వెబ్‌డెస్క్‌ : లగ్జరీ కార్‌ బ్రాండ్‌ ఆడి నుంచి ఎలక్ట్రిక్ కారు ఇండియన్‌ మార్కెట్‌లోకి రానుంది. ఈ ట్రోన్‌ పేరుతో తొలి ఎస్‌యూవీని లాంఛ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ మార్కెట్‌కి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో క్రమంగా అన్ని మేజర్‌ కార్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి.

ఈ ట్రోన్‌ పేరుతో ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారుని ఇండియన్‌ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది ఆడి సంస్థ.  ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర ఎంతనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు.

6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. 

ఈ ట్రోన్‌ కారుని న్యూ ఏజ్‌ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్‌ స్టీరింగ్‌ వీల్‌, ఫోర్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఆంబియెంట్‌ లైటింగ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ తదితర ఫీచర్ల ఉన్నాయి.

మెర్సిడెజ్‌ బెంజ్‌ EQC, జాగ్వర్‌ ఐ పేస్‌ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. 

ఇండియన్‌ మార్కెట్‌లో  ఎలక్ట్రిక్ వెహికల్స్‌ మార్కెట్‌కి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో త్వరలోనే పోర్షే, వోల్వో, లాండ్‌ రోవర్‌ సంస్థలు కూడా లగ్జరీ  ఎలక్ట్రిక్ కార్లను తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

చదవండి: ఆపిల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement