ఆడి ‘ఏ4’లో కొత్త వెర్షన్.. | Audi launches all new A4 sedan, looks to cash in on festive season | Sakshi
Sakshi News home page

ఆడి ‘ఏ4’లో కొత్త వెర్షన్..

Sep 9 2016 1:25 AM | Updated on Sep 4 2017 12:41 PM

ఆడి ‘ఏ4’లో కొత్త వెర్షన్..

ఆడి ‘ఏ4’లో కొత్త వెర్షన్..

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘ఏ4’లో కొత్త వెర్షన్ (బి9)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘ఏ4’లో కొత్త వెర్షన్ (బి9)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.38.1 లక్షల నుంచి రూ.41.2 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇందులో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు. ఇది ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement