సాక్షి, న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కారును గురువారం లాంచ్ చేసింది. ప్రారంభ ధర 1.94 కోట్ల రూపాయలతో భారత మార్కెట్లలో విడుదల చేసింది. జూన్ 23 నుంచి ప్రీబుకింగ్‌లను ఆరంభించామనీ, వచ్చే నెలలో ప్రారంభమవుతాయని ఆడి ఇండియా తెలిపింది. వినియోగదారులు ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.
5 సీట్ల సెకండ్ జనరేషన్ కొత్త ఆర్‌ఎస్ 7 కారులో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి 8 పెట్రోల్ ఇంజీన్ అమర్చింది. టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ హార్ట్ ఇంజిన్ 600 బీహెచ్‌పీ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తమ కొత్త ఆడి ఆర్‌ఎస్7 కేవలం 3.6 సెకన్లలో గంటకు 100 కి.మీ వరకు వేగం పుంజుకుంటుందని ఆడిఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ప్రకటించారు. తన వినియోగదారుల కోసం ఉత్తేజకరమైన ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామన్నారు. కొత్త ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మెర్సిడెస్-ఎఎమ్‌జి ఇ 63 ఎస్, బీఎండబ్ల్యూ ఎం 5 వంటి వాటికి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు. మొదటి తరం ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌ను భారతదేశంలో 2015 లో ఆడి లాంచ్ చేసింది.
Wild and untamed yet elegant and poised. Introducing the all-new #AudiRS7 Sportback. #PerformanceIsAnAttitude pic.twitter.com/tyuwor6SWk
— Audi India (@AudiIN) July 16, 2020
Comments
Please login to add a commentAdd a comment