ఆడి కార్ల ధరలు 5 శాతం పెంపు
వివిధ మోడల్స్ పై 5 శాతం ధరను పెంచనున్నట్టు జర్మనీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడీ ఓ ప్రకటనలో తెలిపింది
తమ సంస్థకు చెందిన వివిధ మోడల్స్ పై 5 శాతం ధరను పెంచనున్నట్టు జర్మనీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడీ ఓ ప్రకటనలో తెలిపింది. పలు ఆర్ధికపరమైన కారకాలు వ్యాపారంపై ఒత్తిడి పెంచాయని, దాంతో ధరను పెంచక తప్పడం లేదని ఆడి ఇండియా విభాగం ఇంచార్జి జో కింగ్ తెలిపారు. ధరల పెరుగుదలతో కార్ల అమ్మకాలపై కొంత ప్రభావం చూపుతుంది అని కింగ్ అన్నారు. అంతేకాక వినియోగదారులను ఆకర్షించడానికి ఆడి ఫైనాన్స్ నుంచి సులభతరమైన ఆప్షన్లను ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఆడి సంస్థ సెడాన్స్ A4, A6, A8, S4, S6, ఎస్ యూ వీఎస్ Q3, Q5, Q7, స్పోర్ట్స్ కార్లు R8, V8, R8 స్పైడర్ మోడల్స్ ను 27.93 లక్షల నుంచి 2.14 కోట్ల ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతికూల పరిస్థుతుల్లో కూడా ఆడి కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది అని సంస్థ మేనేజర్ తెలిపారు. జనవరి-అక్టోబర్ మధ్య కాలంలో 8393 యూనిట్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఈ మధ్యకాలంలోనే బీఎమ్ డబ్ల్యూ కార్ల సంస్థ కూడా భారత్ లో పది శాతం మేరకు ధరలను పెంచింది.