
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్' ఆఫర్‌లోభాగంగా ఐకానిక్ మోడల్స్‌పై ఈ తగ్గింపును అందిస్తోంది. ఆడి పోర్ట్‌ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్లు భారతదేశంలో లాంచ్ చేసి దశాబ్దం పూర్తి కావడంతో, ఆడి కార్లను ప్రేమించే కస్టమర్లకు ప్రత్యేక ధరల బహుమతి ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది.
2009 లో ఇండియాలో లాంచ్ చేసిన పాపులర్ క్యూ 5, క్యూ 7 ఎస్‌యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు తగ్గించింది.
ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5 ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు. ఆఫర్ కింద రూ .49.99 లక్షలకే లభ్యం. తగ్గింపు రూ. 5.81 లక్షలు
క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే రూ .4.83 తగ్గింపుతో రూ .68.99 లక్షలకు లభ్యం.
క్యూ 7 డీజిల్ ఆప్షన్ కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది. అసలు ధర ధర రూ .78.01 లక్షలు. తగ్గింపు రూ .6.02 లక్షలు
ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5, క్యూ 7 కార్లు బహుళ ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం కాగా స్టాక్ కొనసాగే వరకు కొనసాగుతుందని ఆడి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment