న్యూఢిల్లీ: ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్లకు చార్జింగ్ పాయింట్ల వివరాలను అందుబాటులో ఉంచడంపై లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వివిధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. మైఆడికనెక్ట్ యాప్‌లో ’చార్జ్ మై ఆడి’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది చార్జింగ్ పాయింట్లకు అగ్రిగేటర్‌గా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు
దీనికోసం ఆర్గో ఈవీ స్మార్ట్, చార్జ్ జోన్, రీలక్స్ ఎలక్ట్రిక్, లయన్‌చార్జ్, జియోన్ చార్జింగ్ అనే అయిదు పార్ట్‌నర్లతో జట్టు కట్టింది. దీంతో ఈ–ట్రాన్ యజమానులకు 750 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తాము వెళ్లే రూట్‌లో ఉండే పాయింట్ల సమాచారం ముందుగా తెలిస్తే కస్టమర్లు తమ ప్రయాణ ప్రణాళికలను వేసుకునేందుకు సులువవుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఆడి ఇండియా ప్రస్తుతం ఈ–ట్రాన్ శ్రేణిలో 50, 55, స్పోర్ట్‌బ్యాక్, జీటీ మొదలైన వాహనాలను విక్రయిస్తోంది.
ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్
Comments
Please login to add a commentAdd a comment