అమెరికాలో జరిగిన వరస భారతీయ విద్యార్థుల మృతి ఘటనలు మరువక మునుపే మరో విషాదకర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్ వాంకోవర్‌కి చెందిన భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. గుర్తు తెలియని దుండగలు అతడిపై కాల్పులు జరిపినట్లు సౌత్ వాంకోవర్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు ఈస్ట్ 55 అవెన్యూ నుంచి తమకు సమాచరం వచ్చిందని చెప్పారు. బాధితుడు చిరాగ్ ఆంటిల్(24)గా గుర్తించారు అధికారులు.
వాంకోవర్ పోలీసులు ఇంకా అనుమానితులని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. అగంతకుల ఆచూకీకై దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలిపారు. బాధితుడి సోదరుడు రోనిత్ ఉదయం చిరాగ్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను మాట్లాడానని చెప్పాడు. అయితే అతడు ఆడి కారు తీసుకుని ఎక్కడకో వెళ్లాడు. అప్పుడే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదనగా చెప్పాడు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని అభ్యర్థించారు.
ఈ విషాదకర ఘటనపై తక్షణమే స్పందించి.. దర్యాప్తు వేగంవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయాలని ఎక్స్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు చౌదరి. కాగా, చిరాగ్ కుటుంబం అతడి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక చిరాగ్ యాంటిల్ సెప్టెంబరు 2022లో వాంకోవర్‌కి వచ్చారు. అతను ఇటీవలే యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేసి వర్క్ పర్మిట్ పొందాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment