విక్రయాల్లో ఆడి రికార్డు | Audi, Mercedes break previous sales records in India | Sakshi
Sakshi News home page

విక్రయాల్లో ఆడి రికార్డు

Published Sat, Jan 4 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

Audi, Mercedes break previous sales records in India

న్యూఢిల్లీ:  భారత్‌లో ఒక ఏడాది కాలంలో 10 వేల లగ్జరీ కార్లు విక్రయించిన తొలి కంపెనీగా రికార్డ్ సృష్టించామని ఆడి ఇండియా కంపెనీ శుక్రవారం తెలిపింది. గతేడాది 10,002 లగ్జరీ కార్లను విక్రయించామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్  శుక్రవారం తెలిపారు. 2012 అమ్మకాల(9,003)తో పోల్చితే 11 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు.
 
 తగ్గిన బజాజ్ ఆటో అమ్మకాలు
 బజాజ్ ఆటో బైక్‌ల అమ్మకాలు డిసెంబర్‌లో 13 శాతం తగ్గాయి. గత ఏడాది డిసెంబర్‌లో 2,98,350 బైక్‌లను విక్రయించగా, ఈ ఏడాది డిసెంబర్‌లో 2,60, 645 బైక్‌లను అమ్మామని కంపెనీ శుక్రవారం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement