ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో రాబోయే 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే 30 రోజుల్లో తన ఫ్లాగ్ షిప్ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారుని మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. దీని తర్వాత మినీ ఎలక్ట్రిక్ కారును రాబోయే మూడు నెలల్లో లాంఛ్ చేయనుంది. చివరగా ఐ4 సెడాన్ కారును 2022 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
425 కిలోమీటర్ల రేంజ్
మొదటి లాంచ్ చేయనున్నఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారుని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఈ కారు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 6.1 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకుంటుంది. డిసెంబర్ మొదటి వారం నాటికి బీఎండబ్ల్యూ ఐఎక్స్ కారును లాంచ్ చేయనున్నట్లు కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. దీని తర్వాత మినీ ఎలక్ట్రిక్ లాంఛ్ చేయనున్నారు. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 235 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. చివరగా, ఐ4 సెడాన్ కారును 2022 మొదటి అర్ధభాగంలో భారతదేశంలో లాంచ్ చేయనుంది.
(చదవండి: టాటా గ్రూప్ భారీ ప్లాన్.. చైనాకు వేల కోట్ల నష్టం!)
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ కారుతో పాటు 11కెడబ్ల్యు ఏసీ ఫాస్ట్ ఛార్జర్ అందిస్తుంది. దీని ద్వారా రెండున్నర గంటలు ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వెళ్లనుంది. 35 నగరాల్లో గల బీఎండబ్ల్యూ డీలర్ షిప్ కేంద్రాల్లో 50కెడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్లను కూడా ఇన్ స్టాల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ వారం ప్రారంభంలో బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయడానికి పన్ను ప్రోత్సాహకలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. టెస్లా, హ్యుందాయ్ వంటి కంపెనీలు పన్ను ప్రోత్సాహకలను ఇవ్వాలని గతంలో కేంద్రాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment