అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు లాంచ్  | Super expensive BMW launched in IndiaLuxury car M8 coupe  | Sakshi
Sakshi News home page

అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు లాంచ్ 

Published Fri, May 8 2020 3:25 PM | Last Updated on Fri, May 8 2020 3:40 PM

Super expensive BMW launched in IndiaLuxury car M8 coupe  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ  ఇండియా మరోకొత్త లగ్జరీకారును భారత  మార్కెట్లో లాంచ్ చేసింది.  8 సిరీస్ లో భాగంగా   గ్రాన్ కూపే. ఎం8  కూపే పేర్లతో  వీటిని లాంచ్ చేసింది. అయితే గ్రాన్ కూపే రెండు వేరియంట్లలో  ప్రారంభించింది. వీటి ధరలు రూ. 1.29-1.55  కోట్లుగా నిర్ణయించింది.  'ఎం 8 కూపే'  పేరుతో తీసుకొచ్చిన అతి ఖరీదైన అతి విలాసవంతమైన కారు ధర రూ.2.15 కోట్లుగా నిర్ణయించింది.  దీంతో కంపనీకి సంబంధించి ఇదే అతి ఖరీదైన కారుగా నిలిచింది.  

కంపెనీ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అత్యంత శక్తివంతమైన 8 సిలిండర్ ఇంజన్లలో ఇది ఒకటి అని బీఎండబ్ల్యూ తెలిపింది. కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల తరువాత స్థానిక సంబంధిత అధికారుల అనుమతితో దేశీయంగా చెన్నైప్లాంట్ లోఉత్పత్తిని  శుక్రవారం తిరిగి ప్రారంభించినట్టు ప్రకటించింది.

గ్రాన్ కూపే : 3 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో  వచ్చింది. ఇది 340 హెచ్‌పీ పవర్, 1600- 4500 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5.2 సెకన్లలో 0 -100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  (షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..)

ఎం8 కూపే : ట్విన్ టర్బో 4 లీటర్ 8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది  600 హెచ్‌పీ పవర్ ను, 750 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్ 1,800 - 5,600 ఆర్‌పిఎమ్ వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో 0 -100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రెండు అత్యంత డైనమిక్ టర్బోచార్జర్లు, హై-ప్రెజర్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇతరప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

రెండు కార్లలోను 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, అటెన్టినెస్ అసిస్టెంట్ ,డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్  ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్సి) వంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. అలాగే ఆటో హోల్డ్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్,  క్రాష్ సెన్సార్, వెనుక  భాగాన రెండు ఔటర్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లను కూడా జోడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement