లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్‌ సేల్‌, ధర ఎంతంటే? | BMW IX1 Electric SUV Launched In India: Check Here Price, Specs, Features - Sakshi
Sakshi News home page

లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్‌ సేల్‌, ధర ఎంతంటే?

Published Sat, Sep 30 2023 4:22 PM | Last Updated on Tue, Oct 3 2023 12:34 PM

BMW iX1 electric SUV launched in India at Rs 67lakh sold out in few hours - Sakshi

జర్మనీ లగ్జరీ కార్‌ మేకర్‌ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్‌లు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో  తీసుకొచ్చింది. బుకింగ్స్‌ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ఈ హాల్‌ సేల్‌లో   ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది.  రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన  ఈ ఎస్‌యూవీ డెలివరీలో అక్టోబర్‌లో ప్రారంభం. 

లాంచింగ్‌ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్‌ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు.

డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్‌లైట్లు  LED హెడ్‌ల్యాంప్‌లు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌లో బ్లూ యాక్సెంట్‌లతో దాదాపు చతురస్రాకారంలో  గ్రిల్‌ను  అమర్చింది.

iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100  కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్‌పి పవర్‌ను గరిష్టంగా 494 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుంది. ఆల్ఫ్‌లైన్‌ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం.

10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement