
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్4 సిల్వర్ షాడో ఎడిషన్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.71.9 లక్షల నుంచి ప్రారంభం. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో రూపుదిద్దుకుంది.
పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 252 హెచ్‌పీ పవర్‌తో 2 లీటర్ ఇంజన్, 6.6 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ 265 హెచ్‌పీ పవర్‌తో 3.0 లీటర్ ఇంజన్, 5.8 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం చేరుకుంటుంది. బుకింగ్స్ ప్రారంభ అయినట్టు కంపెనీ ప్రకటించింది.
చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..!
Comments
Please login to add a commentAdd a comment