న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ఎక్స్3 ఎస్‌యూవీని గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 59.9 లక్షలుగా ఉంది. స్థానికంగా తయారయ్యే ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 2–లీటర్ ఫోర్–సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 252 హెచ్‌పీ సామర్థ్యాన్ని, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 235 కిలో మీటర్ల వేగం ప్రయాణించగలదు.
బీఎండబ్ల్యూ ఎక్స్ 3కి సంబంధించి డీజిల్ మోడల్‌ను తర్వలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ‘‘మిడ్–సైజ్ స్పోర్ట్ యాక్టివిటీ వెహికల్(ఎస్‌ఏవీ) విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బీఎండబ్ల్యూ ఎక్స్3ని ప్రవేశపెట్టాము. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, డ్రైవింగ్ పనితీరు కస్టమర్లకు సరికొత్త అనూభూతినిస్తాయి’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు.
చదవండి: దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు
Comments
Please login to add a commentAdd a comment