టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో భారీ విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. 48 ఎకరాల భూమిని రూ. 267 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రాప్‌స్టాక్‌కు లభించిన పత్రాల ద్వారా తెలిసింది.
ఏప్రిల్ 18న సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లను బట్టీ తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఉన్న భూమిని ఎకరం సుమారు రూ. 5.56 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అధికారిక సమాచారం రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, 2022లో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను స్థాపించడానికి హైదరాబాద్‌లో సుమారు రూ. 275 కోట్లకు మూడు ల్యాండ్ పార్సెల్‌లను కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment