సాక్షి, చింతామణి: తన తండ్రి వద్ద భూమిని అక్రమంగా రాయించుకున్నారని గంగరాజు అనే వ్యక్తి తన ముగ్గురు బిడ్డలతో కలిసి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన చింతామణి పట్టణంలోని కన్నంపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. తాలూకాలోని మూగలమర్రి గ్రామానికి చెందిన దొడ్డ నరిసింహప్ప అనే వ్యక్తి సర్వే నంబర్ 72లో 8 ఎకరాల 30 గుంటల భూమిలో తనకు వచ్చిన రెండు ఎకరాల 30 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వెంకట రెడ్డి, పల్లప్ప, నారాయణప్ప అనే వారికి రిజిస్టర్ చేయించారు.
దీనికి సంబంధించి దొడ్డ నరసింహప్ప కుమారుడు గంగరాజు తన బిడ్డలు నిఖిల్, నితిన్, అంకిత, తన సంతకం లేకుండా భూమిని కొనుగోలు చేశారని, తనకు అన్యాయం జరిగిందని పోలీసు, రెవెన్యూ అధికారులకు విన్నవించాడు. ప్రయోజనం లేకపోవడంతో శనివారం ఉదయం గ్రామంలోని సెల్ టవర్‌ను తన ముగ్గురు బిడ్డలతో కలిసి ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు గంగరాజును, పిల్లలను సురక్షితంగా కిందకు దించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
(చదవండి: ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్ చేయడమంటే ఇష్టం.. అలా ఢిల్లీ వ్యక్తితో వివాహిత పరార్)
Comments
Please login to add a commentAdd a comment