తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్‌: భూమన | YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్‌: భూమన

Mar 30 2026 1:00 PM | Updated on Mar 30 2026 3:07 PM

YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On Nara Lokesh

సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్‌ అని చెప్పుకొచ్చారు.

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్‌ చేస్తారట. స్టాండ్‌ డ్యూటీ కూడా రియింబర్స్‌మెంట్‌ చేస్తారట. ​ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో నారా లోకేష్‌ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా  22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.

టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ  రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణం

ప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్‌కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి.

కోట్ల స్కాం..? TTD భూములపై లోకేష్ కన్ను

Advertisement
 
Advertisement
Advertisement