ఏకమవుతున్న ఉద్దానం ప్రజలు
అధికారులను అడుగుపెట్టనీయమని హెచ్చరిక
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనాధారమైన పంట భూములు తీసుకుని కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే తమ బతుకులు నాశనమవుతాయని వాపోతున్నారు. మందస మండలం రాంపురం గ్రామంలో ఆదివారం 6 పంచాయతీల ప్రజలు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకుని ఎయిర్‌పోర్టును ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
ఉద్దాన ప్రాంత ప్రజల అవసరాలు, మనోభావాలు తెలుసుకోకుండా, స్థానికుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని బలవంతంగా కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్దాన ప్రాంతానికి ఉద్యమాలు కొత్తకాదన్నారు. జీవనాధారమైన పంట భూముల్ని పరిహారానికి ఆశపడి ఇవ్వబోమని స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా రాంపురం వేదికగా ఉద్దానం ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌గా కొమర వాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో వారం రోజుల్లో పంచాయతీల వారీగా కమిటీలు వేసుకుని అనంతరం పోరాట కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment