మృతి చెందిన విద్యార్థి మేకల సింధుమృతి చెందిన విద్యార్థి మేకల సింధు
వేంపల్లె : వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన మేకల సింధు(17) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి అబ్బ ఓబయ్య ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బక్కన్నగారిపల్లె గ్రామంలో మేకల శ్రీనివాసులు, రాణి దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. వారికి ఇద్దరు కుమార్తెలు పరిమలారాణి, సింధులు ఉన్నారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు 19 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను చదివించుకునేది. పెద్దకుమార్తె రాయచోటిలో ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. చిన్నకుమార్తె సింధు రాయచోటిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో సొంత గ్రామమైన బక్కన్నగారిపల్లెకు వచ్చింది. కాగా, సింధు ఇంటర్ మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. తర్వాత మళ్లీ సెప్టెంబరులో పరీక్షలు రాయగా అందులో కూడా ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో త్రీవ మనస్తాపానికి గురైంది. దీంతో పాటు గత ఆరు నెలలుగా కిడ్నీలో రాళ్లు ఉండడంతో అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున అబ్బ ఓబయ్య, నానమ్మ కాంతమ్మలు ఆరుబయట నిద్రిస్తుండగా ఇంట్లో సింధు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment