
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఐఐటీలో ర్యాంకు రాలేదన్న భయంతో నేరేడ్‌మెట్ బాలాజీనగర్‌లో ఇంటర్ విద్యార్ధి సోహెల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న సోహెల్.. తండ్రి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌గా పనిచేశాడు.
ఇంటర్‌లో బ్యాక్‌లాగ్‌లపై తండ్రి మందలించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన సోహెల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి ఇంట్లో తన బెడ్‌రూమ్‌లోనే గన్‌తో కాల్చుకుని సోహెల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఫలితాలపై బెంగతోనే సోహెల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment