శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Vijayawada Sri Chaitanya College Inter Student Commits Suicide | Sakshi
Sakshi News home page

సిబ్బంది ఒత్తిళ్లు తట్టుకోలేక నాలుగో అంతస్తు నుంచి దూకి

Published Fri, Sep 13 2019 6:21 PM | Last Updated on Fri, Sep 13 2019 7:41 PM

Vijayawada Sri Chaitanya College Inter Student Commits Suicide - Sakshi

సాక్షి, విజయవాడ: కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లు భరించలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. నవలూరు స్వప్న అనే విద్యార్థిని గంగూరు మైత్రి క్యాంపస్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన స్వప్నను తక్షణమే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చామని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం పట్ల కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. తనకు న్యాయం చేయాలని స్వప్న తండ్రి వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement