exam fail
-
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) పాసవడం కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో 13 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ) ప్రకటించింది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుపై విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన వైద్య విద్య ఆయా దేశాల్లో ఉండటం లేదన్న ఆరోపణలకు ఈ ఫలితాలు నిదర్శనంగా చెబుతున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మన దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు, లైసెన్స్ పొందడానికి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కు, పీజీ మెడికల్ చదవడానికి ఎఫ్ఎంజీఈ పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షకు ఆ నాలుగేళ్లలో 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే ఆ నాలుగేళ్లలో కేవలం 14.22 శాతమే పాస్ అయ్యారు. ఈ ఏడాది అది మరింత తక్కువగా ఉండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలైలో 24,269 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, కేవలం 3,089 మందే పాసయ్యారు. మిగిలిన 21,180 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. చైనా, రష్యాలకు ఎక్కువగా వెళుతుండగా, ఆయా దేశాల్లో చదివినవారిలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు మాత్రమే అవకాశముంటుంది. కొన్ని దేశాలు, కొన్ని కాలేజీల్లో నాసిరకమైన వైద్య విద్య ఉండటం, మన దేశంలోని వైద్య విద్యకు సమాన స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. పైగా చైనా, రష్యాల్లో ఆయా దేశ భాషలోనే వైద్య విద్య నేర్చుకుంటారు. ఇక్కడకు వచ్చాక ఎఫ్ఎంజీఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫెయిల్ అవుతున్నారు. పైగా ఎఫ్ఎంజీఈ పూర్తిగా థియరీగా ఉండటం వల్ల కూడా ఫెయిల్ అవుతున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన వైద్య విద్య పూర్తి చేసినవారికి మన దేశంలో ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సిన అవసరంలేదు. . ఎక్కువ ఫీజుతో విదేశాలకు దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెరుగుతున్నా, డిమాండ్‌కు తగినంతగా సీట్లు లేకపోవడంతో అనేకమంది విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20.38 లక్షల మందికి విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. కానీ మన దేశంలో కేవలం 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్లే ఉన్నాయి.దీంతో మన దేశంలో సీటు రానివారు, విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తుంటారు. మరికొందరు మన దేశంలోనే ఎండీఎస్ లేదా ఆయుష్ కోర్సులు చేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,842 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంకా చాలామంది సీటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు ఎక్కువగా ఉంటాయి. కోర్సు పూర్తి చేయాలంటే బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ. 23.10 లక్షల వరకు ఉంటుంది. ఆయా దేశాల్లో ఫీజు తక్కువే కానీ.. అదే విదేశాల్లో చదివితే దేశాన్ని బట్టి ఎంబీబీఎస్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఫీజు మాత్రమే ఉంటుంది. దీంతో చాలామంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, పిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. -
పదో తరగతి పరీక్షల్లో పాసైన 43 ఏళ్ల వ్యక్తి.. కొడుకు ఫెయిల్
ముంబై: పిల్లలు పుట్టినప్పుడు కాదు వారు పెరిగి ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు అసలైన ఆనందం. కనిపెంచిన పిల్లలు కల్లెదుటే మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడితే ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన.. పిల్లలను గొప్పగా చదివించేందుకే తాపత్రయపడుతుంటారు. చదువుకు మధ్యలోనే స్వస్తి పలికిన వారు కొకోల్లలు. ఆర్థిక సమస్యలు, పెళ్లి, కుటుంబ బాధ్యతలంటూ ఎన్నో బరువులను నెత్తిన పెట్టుకొని చదువును దూరం చేసుకుంటారు.తరువాత చదువుకోవాలని అనిపించిన వయసు గుర్తొచ్చి ఆగిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం వయసు సంబంధం లేకుండా విద్యను కొనసాగిస్తారు. మహారాష్ట్రకుచ ఎందిన భాస్కర్ వాఫ్‌మారే కూడా అలాంటి వ్యక్తే. మహారాష్ట్రలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో పుణెకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి ఉత్తీర్ణత సాధించాడు. విశేషమేంటంటే.. ఇదే ఫలితాల్లో తన సొంత కొడుకు ఫెయిల్‌అయ్యాడు. భాస్కర్ వాఘ్మారే తన ఏడో తరగతిలోనే విద్యను ఆపేశాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చిన్న పనిలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న భాస్కర్‌కు పెళ్లి అయి 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే 30 ఏళ్ల తరువాత తన చదువును కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకుతో కలిసి తండ్రి ఒకే ఏడాది పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో భాస్కర్ అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యారు. కానీ తన కొడుకు రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. చదవండి: స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం ‘నేనెప్పుడూ ఉన్నత చదువులు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా అది కుదరలేదు. ఎప్పటి నుంచి చదువును తిరిగి ప్రారంభించాలనుకుంటున్నా. అందుకే 10వ తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు కూడా ఈ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నాడు. వాడి చదువు నాకు సహాయపడింది. రోజు చదవుకునే వాడిని. ఉదయం పనిచేసి సాయంత్రం పరీక్షలకు సిద్ధమయ్యేవాడిని. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషిస్తున్నా.. అయితే నా కొడుకు రెండు పేపర్లలో ఫెయిలవ్వడం బాధగా ఉంది. కానీ వాడిని సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రిపేర్ చేస్తాను.’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్ -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం
పెద్దకొత్తపల్లి/గూడూరు/కుల్కచర్ల/గజ్వేల్‌రూరల్: తక్కువ మార్కులు, ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేక ఐదుగురు ఇంటర్ విద్యార్థులు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన సుధాకర్, రాజేశ్వరి కుమార్తె సోని (16) వనపర్తిలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరం 314 మార్కులు వచ్చాయి. దీంతో తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. (ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్) అలాగే.. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం జంపయ్య, నాగమణి దంపతుల దత్తత కూతురు సోలం సరయు (16) నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లిలోని గిరిజన గురుకుల ఆశ్రమ కళాశాలలో చదువుతోంది. ఈమె మూడు సబ్జెక్టుల్లో తప్పినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన సరయు.. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్ తండాకు చెందిన విస్లావత్ హన్మంతు, సక్రిబాయిల కూతురు నిఖిత (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయింది. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన అగుళ్ల సాయిలు, మంగ దంపతుల కూతురు శ్రావణి (17) ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అలాగే. గజ్వేల్ పట్టణానికి చెందిన బద్రీనాథ్ అలియాస్ అభి (17) ఇంటర్లో ఫెయిలయ్యాడు. ఇది తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
ఫెయిలైన వారికి సీబీఎస్ఈ మరో చాన్స్
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయి 9, 11వ తరగతుల పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. ‘విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా ప్రస్తుత సంవత్సరానికి మాత్రమే వర్తించేలా, విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను మెరుగు పరుచుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం.’ అని గురువారం సీబీఎస్ఈ ప్రకటించింది. ఇప్పటికే పరీక్షలు రాసిన, ఫలితాలు వెలువడిన, ఇప్పటి వరకు పరీక్షలు రాయని, అన్ని సబ్జెక్టుల వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. ఈ పరీక్షలో ఫలితాల ప్రాతిపదికన విద్యార్థులను పై తరగతులకు పంపవచ్చని పాఠశాలల యాజమాన్యాలకు తెలిపారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా విద్యార్థులకు తగిన విధంగా సమయం ఇవ్వాలన్నారు. వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలను జూలై ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే బోర్డు ప్రకటించింది. ప్రతిభతో సంబంధం లేకుండా 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు గత నెలలో సీబీఎస్ఈ ప్రకటించడం తెల్సిందే. ‘పరీక్షలు సరిగా రాయలేకపోయిన విద్యార్థులు మరింత నిరుత్సాహానికి గురవడం సహజం. అందుకే, వారి ఆందోళనను పోగొట్టి, మానసిక స్థైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని భరద్వాజ్ తెలిపారు. -
రిజల్ట్స్ పరీక్ష కాకూడదు
ప్రతిభకు పరీక్ష ఉండాలి.. ఆత్మవిశ్వాసానికి కాదు.ప్రయత్నాన్ని మించిన విజయం లేదనిపిల్లలకు చెప్పగలగాలి. ప్రయాణాన్ని మించిన గమ్యం ఉండదనిపిల్లలకు తెలియజేయాలి.పరీక్ష అయిపోయిందనీ.. రిజల్ట్ మనకు పరీక్ష కాదనీ చెప్పాలి. పరీక్షలు – ఫలితాలు– ఆత్మహత్యలు... ఈ మూడూ ఒకదానితో ఒకటి ఎందుకు ముడిపడి ఉన్నాయి? పరీక్ష ఫెయిలైతే ఆత్మహత్య చేసుకోవడమేనా? జీవితం విలువ ఒక పరీక్షకు సమానమా? కాదు... అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ జీవితం విలువ తెలిస్తే ఆ జీవితాన్ని ముగించుకోవాలని అనుకోరెవ్వరూ. పిల్లలకు జీవితం విలువ తెలియచెప్పాలి. జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించాలి. అప్పుడు పరీక్ష ఫెయిలయినందుకు ప్రాణం తీసుకోవడం ఉండదు. మార్కులు తగ్గాయని మరణాన్ని ఆశ్రయించడం ఉండదు. అమ్మ తమను కడుపులో మోసి కనిపెంచిన కష్టం కంటే పరీక్ష పోవడం పెద్ద కష్టం కాదని పిల్లలకు ఎవరు చెప్పాలి? మార్కుల రేస్‌లో పిల్లల్ని పరుగెత్తించడం ఎంత తీవ్రమైనదంటే..ఏడాదంతా ప్రేమగా చూసుకున్న ఎడ్లకు సంక్రాంతి రోజు పందేలు పెట్టి... అవి వాటి శక్తి కొద్దీ బరువును లాగుతున్నా సరే... సంతృప్తి చెందకుండా గెలుపు కోసం హింసిస్తూ ఉంటారు. ఆ హింస పైకి కనిపిస్తుంది. పిల్లల మెదళ్ల మీద పెట్టే బరువు పైకి కనిపించదు. పిల్లల మనసు మోస్తున్న భారం కూడా పైకి కనిపించదు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీలు పట్టి, రాత్రంతా మేల్కొని... చదివిన పాఠాలనే మళ్లీ మళ్లీ చదివి పరీక్షలు రాస్తారు. ‘హమ్మయ్య పరీక్షలయిపోయాయి’ అని ఊపిరి పీల్చుకున్నప్పటి నుంచే ‘ఫలితాల’ భూతం వెంటాడుతుంది. అమ్మానాన్నలకేమైంది! కార్పొరేట్ విద్యాసంస్థలు గీసిన రన్నింగ్ ట్రాక్ మీద అమ్మానాన్నలు ఎప్పుడు ట్రాక్ ఎక్కారో వాళ్లకే తెలియదు, రేసుగుర్రాల్లా అలా పరుగెత్తుతూనే ఉన్నారు. తమ పిల్లలు టాప్‌లో ఉండాలనే ధ్యాస తప్ప, అమ్మానాన్నలు... తమ పిల్లలు మనుషులుగా ఎదగాలనే సంగతి మర్చిపోయి ఒక తరం గడిచిపోయింది. నంబర్‌వన్ రేసులో గెలవడానికి శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. అమ్మానాన్నలు పిల్లలతో మాట్లాడేది ‘‘హోమ్‌వర్క్ చేశావా, ఎంతసేపూ ఆటలేనా? చదువుకోవా? టీవీ చూసింది చాలు ఇక పడుకో, సెల్‌ఫోన్ వదిలిపెట్టవా... ఇలాగైతే నువ్వు ఎగ్జామ్స్ పాసయినట్లే’’ అని గద్దించడానికే. ఆ రోజు వాళ్లేం చేశారో అడిగి వారు చెప్పే కబుర్లు వినే ఓపిక ఉండడం లేదు. ప్రోగ్రెస్ రిపోర్టు చూసి ముఖం చిట్లింపులు... చీదరింపులూ ఎక్కువైంది. పట్టించుకోని పిల్లలు బాగానే ఉంటున్నారు. సున్నితంగా ఆలోచించే పిల్లల మనసులు మాత్రం ఆ మాటలకు కల్లోల కాసారాలవుతున్నాయి. ‘అమ్మానాన్నలు నా కోసం చాలా కష్టపడుతున్నారు... నేనే వాళ్లను సంతృప్తి పరచలేకపోతున్నాను. ఈ మార్కులు చూస్తే అమ్మ బాధ పడుతుందేమో, నాన్నకు కోపం వస్తుందేమో! వాళ్లనలా చూడలేను, నా ముఖం వాళ్లకు చూపించలేను’ ఇలా సాగుతుంటాయి పిల్లల ఆలోచనలు. ఆ మానసిక సంఘర్షణ ఫలితమే ఈ ‘ఫలితాల మరణాలు’. మార్కులకంటే విలువైన వాళ్లు ‘పరీక్ష ఇప్పుడు పోతే మరోసారి రాసుకోవచ్చు, జీవితం పోతే మళ్లీ రాదు. పరీక్షలో పాస్ కావడమే జీవితం కాదు’ అని పిల్లలకు ధైర్యాన్నిచ్చే అమ్మానాన్నలు తగ్గిపోతున్నారు. అది ఆందోళన చెందాల్సిన విషయం. పిల్లలు ప్రాణం తీసుకుంటున్నారంటే అసలు కారణం పరీక్షలు కాదు. తల్లిదండ్రులు వాళ్లతో స్నేహితుల్లా మెలగలేకపోవడం అంటారు చైల్డ్ సైకాలజిస్ట్ జయశేషు. తన దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చే పిల్లల్లో ఎక్కువమంది కోరిక ఒక్కటే.. ‘అమ్మానాన్నలు తనను తమ పక్కింటి పిల్లవాడిని చూసినట్లు చూడాలి’ అని. ఆ పిల్లాడితో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ పిల్లాడిని కసురుకోరు. నన్ను మాత్రం ప్రతి చిన్నదానికీ కసురుకుంటారు’ అని పిల్లలు మనసు విప్పుతున్నారు. ‘‘ఆధునిక మానవుడు సభ్యసమాజంలో గౌరవంగా జీవించాలంటే చదువు అవసరమే, చదువు విలువ పిల్లలకు తెలియ చెప్పాల్సిందే. అయితే చదువంటే మార్కుల నంబరు రేస్ కాదు. సబ్జెక్ట్‌ని నేర్చుకున్నారా, చదివింది ఆకళింపు చేసుకున్నారా అన్నంత వరకే పరిమితం కావాలి’’ అన్నారామె. మార్కులకంటే పిల్లలే విలువైన వాళ్లనే సత్యాన్ని అమ్మానాన్న గుర్తించకపోతే పసిమొగ్గలు విచ్చుకోకనే రాలిపోతాయి. ‘వజ్రమైనా సానపడితేనే కాంతులీనుతుంది’ అనే సూక్తిని మరీ ఎక్కువగా ఒంటపట్టించుకున్న పేరెంట్స్... సానబెట్టే క్రమంలో వజ్రాన్ని తునాతునకలు చేసుకుంటున్నామని మర్చిపోతే ఎలా? వాకా మంజులారెడ్డి ‘అబ్బా.. బోర్’ అనిపించకూడదు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉన్న ప్రశాంతి కౌన్సెలింగ్ అండ్ హెచ్ఆర్డి సెంటర్‌కి వెళ్లినప్పుడు.. ఆ ప్రాంగణంలో.. పిల్లలకు పెద్దలు విధిగా తెలియజెప్పాల్సిన కొన్ని గుడ్ హ్యాబిట్స్ గురించి అక్కడి సైకాలజిస్టులు పెద్దలకు చెబుతూ కనిపించారు. పెద్దలతోపాటు వాళ్ల పిల్లలూ ఉన్నారు. పెద్దలు కూడా ఇంటికి రాగానే, ఇలాంటి కొన్ని మంచి అలవాట్లను ఒక చార్ట్ మీద రాసి పిల్లలకు రోజూ కనిపించేటట్లు గోడకు తగిలించాలి. త్వరగా నిద్రపోవాలి, ఉదయం త్వరగా లేవాలి. నీటిని పొదుపు చేయాలి. ప్రకృతిని, చెట్లను రక్షించాలి. మూగ జీవుల్ని హింసించ కూడదు. ఆహారాన్ని వృథా చేయరాదు. హోమ్‌వర్క్‌ను వాయిదా వేయవద్దు. ఆడుకోవాలి, కానీ ఆటల్లోనే గంటల కొద్దీ సమయాన్ని గడపకూడదు. సూర్యరశ్మి, నడక, కోపాన్ని అణుచుకోగలగడం... ఈ మూడూ ఎప్పుడూ వదలకూడని మంచి స్నేహితులు. వాయిదా వేయడం, బద్దకం, అతి నిద్ర... ఈ మూడూ ఎప్పుడూ దరి చేరనివ్వకూడని చెడ్డ స్నేహితులు.. ఇలాంటివి రాసి ఉంచాలి. అయితే వీటి చూస్తూ ఒకసారి పిల్లలు మారిపోతారని కాదు. ఒక్కరోజే అన్నింటినీ ఒంటపట్టించుకుంటారనీ కాదు. రోజూ చెప్తుంటే ‘‘అబ్బా బోర్’’ అని చెవులు మూసుకుంటారు. మనం చెప్పకుండా వాళ్ల చూపు పడేలా ఉంచితే... రోజులో కనీసం ఒక్క నిమిషమైనా ఆ మంచిమాటల మీద వాళ్ల దృష్టి పడుతుంది. ఒకసారి చూసిన సంగతి కానీ విన్న సంగతి కానీ తప్పకుండా మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లలతోపాటు వారిలో విలువలూ పెరుగుతాయి. ఈదడం వస్తే... ఎదురీదడమూ వస్తుంది కోల్‌కతాలో ప్రభుత్వం సర్కస్ని నిషేధించింది. పులులతో సహా జంతువులన్నింటినీ తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేశారు. మామూలుగా అడవిలో పులి సంచరిస్తుంటే మిగిలిన జంతువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమను తాము రక్షించుకోవడానికి పరుగులు తీస్తాయి. అయితే సర్కస్ నుంచి వచ్చిన పులులు తాము వేటాడవచ్చనే సంగతినే మర్చిపోయాయి. కేర్‌టేకర్ పెట్టే మాంసాన్ని తినడానికి అలవాటు పడిన ఆ పులులు వేటాడలేక అడవిలో పుట్టి పెరిగిన వేటకుక్కల దాడిలో మరణించాయి. మనుషులు కూడా అలాగే అయిపోతున్నారు. పిల్లలకు ఏ పనీ తెలియకుండా పెంచుతున్నారు. ఆఖరుకి తమను తాము రక్షించుకోవడం కూడా చేతకానంత ఓవర్ ప్రొటెక్షన్ అది. గ్రామాల్లో పదేళ్లకే పిల్లలు ఈత నేర్చుకుంటారు. పట్టణాలు, నగరాల్లో పిల్లలను పేరెంట్స్ రోడ్డు కూడా సొంతంగా దాటనివ్వడం లేదు. పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు పొరపాటున నీళ్లలో పడితే అప్పుడు పిల్లలు ఆ భయాందోళనలతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత వచ్చి ఉంటే బస్సు నీళ్లలో ఎంత లోతులో పడిపోయినా సరే... ధైర్యాన్ని కోల్పోరు. మునిగిపోయినా పైకి తేలగలం అనే భరోసా అది.అలాగే ఈ తరం పిల్లలు చిన్న నిరాశను కూడా భరించలేకపోతున్నారు. మా దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చే పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్లకు నిండా పదిహేనేళ్లు ఉండవు. ‘లైఫ్ ఈజ్ మిజరబుల్’ అంటారు. అమ్మానాన్న తన పట్ల డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారంటారు. హర్టయ్యానని చెబుతారు. మన పెంపకంలో పిల్లల్లో ‘పెద్ద కష్టాన్ని కూడా చిన్నదిగా చూడగలిగిన పరిణతి’ రావాలి. అంతేతప్ప చిన్న కారణాన్ని పెద్దగా ఊహించుకుని బెంబేలు పడడం అలవడుతోంది. అది పూర్తిగా పెంపకంతోపాటు విద్యావిధానంలో ఉన్న లోపం. నేను ముప్పయ్ ఏళ్లుగా బాల వికాస్‌లో పిల్లలకు కథలు చెప్తున్నాను. అంటే కథల రూపంలో జీవన నైపుణ్యాలను చెప్తాను. ఇక్కడ ఒక సంగతి గమనించాలి... పిల్లలను తీర్చిదిద్దడానికి చెప్పే ఏ కథలోనూ బతకలేక ఆత్మహత్య చేసుకోవడం ఉండదు. బతికి సాధించి చూపించడమే ఉంటుం ది. బాల్యంలో నేర్చుకున్న విలువలు వాళ్లకు జీవితమంతా గుర్తుంటాయి. అవరోధాలను ఎదుర్కోవాలని చెప్పడానికి కూడా ఇదే సరైన వయసు. బి. జయశేషు పట్టాభిరామ్, చైల్డ్ సైకాలజిస్ట్, ప్రశాంతి కౌన్సెలింగ్ అండ్ హెచ్ఆర్డి సెంటర్, హైదరాబాద్ -
నాలుగో వంతు ఆర్వోలు ఫెయిల్ !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం నిర్వహించిన సర్టిఫైడ్ శిక్షణ కార్యక్రమానికి హాజరై, పరీక్ష రాసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్వో)ల్లో నాలుగో వంతుకు పైగా అధికారులు ఫెయిలయ్యారు. మూడో వంతుకు పైగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఆర్వో)లు సైతం ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ఏర్పా ట్లు, నిర్వహణ అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరై పరీక్ష రాసిన 119 మంది రిటర్నింగ్ అధికారుల్లో 29 మంది, 251 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల్లో 90 మంది ఫెయిలయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రిట ర్నింగ్ అధికారులదే. వారి పరిధిలో ఉండి సహాయకులుగా ఏఆర్వోలు పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 119 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు 251 ఏఆర్వోలను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఆర్వోలు, ఏఆర్వోలు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఎన్నికల సంఘం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండోసారి పరీక్ష నిర్వహణ ఎన్నికల కోడ్ అమలు, సెక్టోరల్ అధికారుల నియామకం, నామినేషన్ల స్వీకరణ/ పరిశీలన/ ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్/ కౌంటింగ్ పాసుల జారీ తదితర అంశాలపై స్టేట్ లెవల్ మాస్టర్ ట్రైనర్ల (ఎస్ఎల్ఎంటీ)తో ఆర్వోలు, ఏఆర్వోలకు ఎన్నికల సంఘం శిక్షణ నిర్వహించింది. శిక్షణ అనంతరం అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే ప్రశ్నపత్రంతో రెండు పార్టులతో పరీక్ష నిర్వహించింది. బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో నిర్వహించిన ఈ పరీక్షలో నాలుగో వంతు ఆర్వోలు, మూడో వంతు ఏఆర్వోలు విఫలమయ్యారు. ఫెయిలైన ఆర్వోలు, ఏఆర్వోలకు ఎన్నికల సంఘం ఆదేశాలతో గురువారం మరోసారి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఎస్ఎల్ఎంటీలతో మళ్లీ శిక్షణ నిర్వహించి రెండోసారి పరీక్ష నిర్వహించారు. రెండోసారి విఫలమైన ఆర్వో, ఏఆర్వోలను తప్పించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం అధికారవర్గాలు తెలిపాయి. నిర్మల్ జిల్లా ఆర్వోలందరూ ఫెయిల్ అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోని 15 మంది ఆర్వోల్లో ఐదుగురు, 33 మంది ఏఆర్‌వోల్లో 21 మంది, నిర్మల్ జిల్లాలోని ముగ్గురికి ముగ్గురు ఆర్వోలు, ఆరుగురు ఏఆర్‌వోల్లో నలుగురు ఫెయిలయ్యారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురిలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలోని ఐదుగురిలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లా లో ఇద్దరిలో ఒక ఆర్వో ఫెయిలయ్యారు. -
ఈసీ పరీక్షలో 323 అధికారులు ఫెయిల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో.. ఎలక్షన్ల కోసం సన్నద్ధమవుతున్న ఎన్నికల సంఘానికి ఆ రాష్ట్ర అధికారులు కొందరు షాకిచ్చారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సిన విధులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో 323 మంది అధికారులు కనీస ప్రతిభ కూడా చూపడంలో ఫెయిలయ్యారు. దీంతో ఈసీ అధికారులు అవాక్కయ్యారు. ఇందులో సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ (గ్రూప్–1, డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్లు) స్థాయి అధికారులు కూడా ఉన్నారు. భోపాల్, సెహోర్, హోషంగాబాద్, రాఘోఘట్, గునా, గ్వాలియర్, ఇండోర్, ఛతర్పూర్ తదితర జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో కీలక పాత్రల్లో ఈ అధికారులు నియమితులయ్యారు. దాదాపు 700 మంది అధికారులకు ఎన్నికల విధుల నిర్వహణపై ఉన్న అవగాహనపై పరీక్ష నిర్వహించారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. చాలా మంది అధికారులు పరీక్ష ఫెయిలయ్యారు. ఇలా ఉంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిపెట్టాలి’ అని ఆర్టీఐ కార్యర్త అజయ్ దుబే విమర్శించారు. -
పరీక్ష బాగా రాయలేదని యువతి..
బాగేపల్లి: పరీక్ష బాగా రాయలేదు, ఉన్నత చదువులు చదవగలనో లేదోన నే భయంతో ఒక యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగేపల్లి పట్టణంలోని 16వ వార్డులో జరిగింది. ఆమెను బాగేపల్లి వార్డులోని 16వ వార్డులో నివాసం ఉంటున్న ఎస్.మురళిధర్ అనే వ్యక్తి కుమార్తె తనుషా (20)గా గుర్తించారు. ఆమె పట్టణంలో ఉన్న నేషనల్ కళాశాల్లో బీఎస్సీ మూడవ సంవత్సరం చదువేది. వారం రోజుల క్రితం పరీక్షలు కూడా రాసింది. ఆదివారం ఉదయం బాగేపల్లి పట్టణంలో ఉన్న తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి తన కుమార్తెను ఎమ్మెస్సీ చదివించాలని అనుకున్నాడు. కానీ శనివారం జరిగిన బీఎస్సీ పరీక్షను సరిగా రాయలేదని, దాంతో ఏమవుతుందోననే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాగేపల్లి పోలీసులూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురు ఫెయిలందని తల్లి ఆత్మహత్య
మైసూరు: కుమార్తె పరీక్షల్లో ఫెయిలనందుకు తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం నగరంలోని ఇలవాలలో చోటు చేసుకుంది. నగరంలోని ఇలవాలకు చెందిన లక్ష్మీ,రాజు దంపతుల కుమార్తె ఇటీవల ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు రాసింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో కుమార్తె ఫెయిలవడంతో మనస్థాపం చెందిన లక్ష్మీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలవాల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
క్షణికావేశం!
వనపర్తి క్రైం: చిన్నచిన్న కారణాలను సాకుగా చేసుకుని క్షణికావేశానికి లోనవుతున్నారు.. ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.. పిల్లలను అనాథలను చేస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా.. ప్రేమ విఫలమైనా.. కుటుంబంలో కలహాలు వచ్చినా.. పరీక్షల్లో తప్పినా.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువగా మహిళలు, యువకులే ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహాలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. ఇవీ లక్షణాలు ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధ చూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఎక్కువగా వీరు నిద్రలేకుండా ఉండటం, ఆందోళన, మానసిక ఓత్తిడి, కంగారు పడటం, తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యువతి, యువకులు పరిక్షల్లో పేలయినా, ప్రేమలో విఫలమయినా చావును వెతుక్కుంటూ వెళ్తున్నారు. చాలామంది కుటుంబ కలహాలతో ఎంతో మంది మహిళలు ప్రాణాలు తీసుకుని కుటుంబానికి తీరని విషాదం నింపుతున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే.. ప్రతి చిన్న విషయానికి చావే శరణ్యమని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచన చేస్తే వారిపై ఆధారపడిన వారు రోడ్డున పడతారనే విషయం గుర్తుకొస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేకపోవడంతో ప్రతి చిన్నదానికి వారితో చెప్పే ధైర్యం లేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముందువెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. సమస్యను ౖధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కోనాలి. భార్యాభర్తల మధ్య సర్దుబాటు లేకపోవడం, యువత చెడు అలవాట్లకు గురికావడంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత ప్రేమలో విఫలమైనా.. పరిక్షలో ఫేలైనా మనోధైర్యం కోల్పోతున్నారు. చనిపోయి అందరిని దూరమయ్యేదానికన్నా బతికుండి సమస్యను ఎదుర్కోవాలి. – రవిసాగర్, సైకాలజిస్ట్, వనపర్తి -
ఫీజు కోసం ఫెయిల్
సిద్దిపేటఎడ్యుకేషన్: పరీక్ష ఫీజుల కోసమే తమను ఫెయిల్ చేస్తున్నారంటూ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడ్డారు. అటానమస్‌ను అడ్డుపెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్వీ, ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు రాజేందర్‌నాయక్, దామోదర్, వంశీ మాట్లాడుతూ..సెమీస్టర్ పరీక్షల్లో విద్యార్థులను కావాలనే కళాశాల నిర్వాహకులు ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పరీక్ష ఫీజుల కోసం ప్రతిభ కలిగిన విద్యార్థులకు సున్నా మార్కులు ఎమి రాని వారికి మాత్రం మంచి మార్కులు వేస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రీవాల్యుయేషన్ ఫలితాలు రాక ముందే సప్లమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించాలనే గడువు విధించడం ఏంటని ప్రశ్నించారు. సమస్యలను రాత పూర్వకంగా అందిస్తే పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్న ప్రిన్సిపల్, అధ్యాపకుల సూచన మేరకు విద్యార్థులు ధర్నా విరమించారు. సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. -
ఫెయిల్ అయ్యానని..
నకిరేకల్: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న చల్ల కవిత కూతురు దుర్గ (17) హైదరాబాద్‌లోని తన మామయ్య వద్ద ఉం టోంది. అక్కడే సరూర్ నగర్‌లోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్న దుర్గ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయ్యింది. వేసవి సెల వుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇటీవల తన ఇంటికి వచ్చి తల్లి వద్ద ఉంటోంది. తల్లి కవిత పక్కిoటికి వెళ్లగానే ఇంట్లో చిన్న డబ్బాలో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్కసారిగా మం టలు రావడంతో చుట్టు పక్కల వారు వచ్చి మం ట లు ఆర్పారు. కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దుర్గను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఇంటర్ ఫెయిలైనందుకు విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం(ఆముదాలవలస): ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు సునీత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కాత్యాచార్యులపేటకి చెందిన సునీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూతురు చనిపోయిందన్న విషయాన్ని గ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.