పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న చల్ల కవిత కూతురు దుర్గ (17) హైదరాబాద్‌లోని తన మామయ్య వద్ద ఉం టోంది.
నకిరేకల్: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న చల్ల కవిత కూతురు దుర్గ (17) హైదరాబాద్‌లోని తన మామయ్య వద్ద ఉం టోంది. అక్కడే సరూర్ నగర్‌లోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. హెచ్‌ఈసీ గ్రూప్ తీసుకున్న దుర్గ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయ్యింది. వేసవి సెల వుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇటీవల తన ఇంటికి వచ్చి తల్లి వద్ద ఉంటోంది. తల్లి కవిత పక్కిoటికి వెళ్లగానే ఇంట్లో చిన్న డబ్బాలో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
ఒక్కసారిగా మం టలు రావడంతో చుట్టు పక్కల వారు వచ్చి మం ట లు ఆర్పారు. కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దుర్గను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.