ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు సునీత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
శ్రీకాకుళం(ఆముదాలవలస): ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు సునీత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కాత్యాచార్యులపేటకి చెందిన సునీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూతురు చనిపోయిందన్న విషయాన్ని గ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.