తనుషా (ఫైల్)
బాగేపల్లి: పరీక్ష బాగా రాయలేదు, ఉన్నత చదువులు చదవగలనో లేదోన నే భయంతో ఒక యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగేపల్లి పట్టణంలోని 16వ వార్డులో జరిగింది. ఆమెను బాగేపల్లి వార్డులోని 16వ వార్డులో నివాసం ఉంటున్న ఎస్.మురళిధర్ అనే వ్యక్తి కుమార్తె తనుషా (20)గా గుర్తించారు.
ఆమె పట్టణంలో ఉన్న నేషనల్ కళాశాల్లో బీఎస్సీ మూడవ సంవత్సరం చదువేది. వారం రోజుల క్రితం పరీక్షలు కూడా రాసింది. ఆదివారం ఉదయం బాగేపల్లి పట్టణంలో ఉన్న తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి తన కుమార్తెను ఎమ్మెస్సీ చదివించాలని అనుకున్నాడు. కానీ శనివారం జరిగిన బీఎస్‌సీ పరీక్షను సరిగా రాయలేదని, దాంతో ఏమవుతుందోననే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాగేపల్లి పోలీసులూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment