కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు
సిద్దిపేటఎడ్యుకేషన్: పరీక్ష ఫీజుల కోసమే తమను ఫెయిల్ చేస్తున్నారంటూ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడ్డారు. అటానమస్‌ను అడ్డుపెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్వీ, ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు రాజేందర్‌నాయక్, దామోదర్, వంశీ మాట్లాడుతూ..సెమీస్టర్ పరీక్షల్లో విద్యార్థులను కావాలనే కళాశాల నిర్వాహకులు ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
పరీక్ష ఫీజుల కోసం ప్రతిభ కలిగిన విద్యార్థులకు సున్నా మార్కులు ఎమి రాని వారికి మాత్రం మంచి మార్కులు వేస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రీవాల్యుయేషన్ ఫలితాలు రాక ముందే సప్లమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించాలనే గడువు విధించడం ఏంటని ప్రశ్నించారు. సమస్యలను రాత పూర్వకంగా అందిస్తే పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్న ప్రిన్సిపల్, అధ్యాపకుల సూచన మేరకు విద్యార్థులు ధర్నా విరమించారు. సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment