సాక్షి,హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది.
ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైడ్రా అధికారాలు ఏంటని పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది.
హైడ్రా జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అవుటర్ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలో చెరువులు, కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రా న్యాయవాది విచారణకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులపై హైకోర్టు ప్రశ్నలు..
గ్రామపంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని జన్వాడ ఫామ్‌హౌజ్ తరపున పిటిషన్ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సర్పంచ్‌కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామపంచాయతీ సెక్రటరీకి మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం ఉందని, సర్పంచ్‌కు లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment