చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
హైదరాబాద్ : చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న నిరుపేదలకు చెందిన 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని పేదలు వాపోయారు.
ఇళ్లు కూల్చినందుకు నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు.