బొగొటా : 10 మంది కార్మికుల మరణానికి కారణమైన నిర్మాణంలో ఉన్న నాసిరకం బ్రిడ్జిని కొలంబియా అధికారులు కూల్చివేశారు. కొలంబియా రాజధాని బొగొటా, విల్లావిసేన్సియో నగరాలను కలిపే హైవేపై చిరజరలోని లోయ పైనుంచి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతిచెందారు. డిజైన్‌లో లోపం కారణంగానే బ్రిడ్జి ప్రమాదానికి కారణమైందని తేలడంతో, భద్రతా చర్యల్లో భాగంగా బ్రిడ్జిని కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. 100కిలోల పేలుడు పదార్థాలు, 30 డిటోనేషన్ పరికరాలను ఉపయోగించి క్షణాల్లో బ్రిడ్జిని భూస్థాపితం చేశారు. నాసిరకం పనుల కారణంగా ప్రాణ నష్టంతో పాటూ భారీ మొత్తంలో డబ్బు వృథా అయింది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
బ్రిడ్జి డిజైన్‌లో లోపం.. కూల్చేసిన అధికారులు
Published Fri, Jul 13 2018 11:21 AM | Last Updated on Fri, Jul 13 2018 11:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment