సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.
అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.
డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.
ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి
Comments
Please login to add a commentAdd a comment