టీడీపీ కూటమి ప్రభుత్వ దమనకాండపై వైఎస్సార్‌సీపీ మండిపాటు
నిర్మాణంలో ఉన్న తాడేపల్లి వైఎస్సార్‌సీపీ నూతన కేంద్ర కార్యాలయం కూల్చివేత
అక్రమ కట్టడమని చెబుతూ.. తెల్లవారే లోపే కూల్చేసిన అధికారులు
ప్రభుత్వ చర్యపై వైఎస్సార్‌సీపీ మండిపాటు
కూల్చివేత స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
నియంతలా చంద్రబాబు తన దమనకాండ మరో స్థాయికి తీసుకెళ్లారు: వైఎస్ జగన్
మాజీ మంత్రులు అంబటి, కాకాణి, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు నేతల స్పందన
న్యాయపోరాటం చేసి తీరతామని స్పష్టీకరణ
గుంటూరు, సాక్షి: తెల్లవారక ముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ.. ప్రతీకార రాజకీయాలు దిగిందనే చర్చ మొదలైంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబు దమనకాండ మరో స్థాయికి చేరిందంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్సార్‌సీపీ నేతల స్పందన
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
- చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తోంది.
- హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు
- గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారు
- పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు
- న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారు
- తెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంది
- ఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుంది
- పర్మిషన్ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారు
- మేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం.
- కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాం
- డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారు
- కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుంది
- చట్టం 115 సీఆర్‌డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాము
- కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారు
- కోర్టు ఆదేశాల విషయం సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాం
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?
- కక్షసాధింపు తప్ప చంద్రబాబు పాలనలో ఇంకేమైనా ఉందా?
- ఏపీలో వైఎస్సార్‌సీపీ ఆఫీసులే ఉండకూడదన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోంది
- చంద్రబాబు పాలన తొలిరోజు నుండే దారుణాలు జరుగుతున్నాయి
- నియంతృత్వ వైఖరితో చంద్రబాబు పని చేస్తున్నారు
- క్రమశిక్షణతో పని చేయాలని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు
- తెల్లవారేపాటికి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు
- చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట నివాసం అక్రమం
- దాన్ని కూల్చుతామని గతంలోనే దేవినేని ఉమా చెప్పారు
- అధికంగా బూతులు మాట్లాడేదెవరని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అయ్యన్నపాత్రుడినే చూపిస్తోంది
- అలాంటి వ్యక్తిని స్పీకర్‌గా నియమించారంటేనే సభను ఎలా జరపాలనుకుంటున్నారో అర్థం అవుతోంది
- ఇలాంటి మనస్తత్వం ఉన్న స్పీకర్.. వైఎస్సార్‌సీపీ సభ్యులను మాట్లాడనిస్తారా?
- జగన్‌ను అవమానించటానికీ, ఆయన ఆస్తులను ధ్వంసం చేయడానికే చంద్రబాబు సీఎం అయ్యారా?
:::టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే
నాడు లేని సమస్య.. నేడు ఎందుకు?
- చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు లేదంటూనే కక్ష సాధింపు చేపడుతోంది
- గతంలో 12 చోట్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థలాలు లీజుకు తీసుకుంది
- అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది?
- చట్టబద్ధంగా లీజుకి తీసుకున్న స్థలంలో కార్యాలయం నిర్మిస్తే తప్పేంటి..
- జరిగిన సంఘటన అందరూ ఖండించాలి
:::మాజీ ఎంపీ మార్గాని భరత్, తూర్పుగోదావరి
చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరించాలి
- కూల్చివేతలకు మేము వ్యతిరేకం
- కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు
- ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(ఢిల్లీ)
పార్టీ ఆఫీస్‌లు మాకు దేవాలయాలు.. రక్షించుకుంటాం
- ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి
- ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ద్వసం చేస్తున్నారు
- తాడేపల్లిలో కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు
- కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్న పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు
- చంద్రబాబు లోకేష్ వెళ్ళేటపుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కనిపిస్తుందని కూల్చేశారు
- అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు
- మేము మీలాగే దాడులు చేసి ఉంటే టీడీపీ కార్యాలయాలు ఉండేవా?
- మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఒక వాగులో ఉంది
- చాలా జిల్లాల్లో 2015 నుంచి 2019 నుంచి టీడీపీ కార్యాలయాలు కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారు.
- కేబినెట్ నిర్ణయం మేరకు వైఎస్ఆర్సీపీ వైజాగ్ ఎండాడలో 2 ఎకరాల స్థలం తీసుంది
- పార్టీ కార్యాలయం కోసం ప్లాన్ అప్రూవల్ తీసుకొని నిర్మాణం చేపట్టాము
- ఫిబ్రవరి నెల 2023 తేదీన ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం
- 15 లక్షలు రూపాయలు ప్లాన్ అప్రూవల్ కోసం చెల్లించాం
- నిబంధనలు ప్రకారం బిల్డింగ్ నిర్మించాం
- గజాల్లో ఉంటే gvmc పరిధిలో కి వస్తుంది.. ఎకరాల్లో ఉంటే vmrda అనుమతి తీసుకోవాలి
- ఏడాది క్రితమే అనుమతి తీసుకున్నాం
- ఆ మాటకొస్తే.. వైజాగ్ లో టీడీపీ కార్యాలయానికి 15 ఏళ్ల వరకు ప్లాన్ అప్రూవల్ లేనేలేదు
- అధికారంలో ఉన్నాము కాబట్టి ఏదైనా చేస్తామంటే చెల్లదు
- మీ రెడ్‌బుక్ పాలన చేస్తామంటే కుదరదు.
- పద్ధతి ప్రకారం చేస్తే పార్టీ కార్యాలయం ఉండడానికి వీళ్లేదా?
- టీడీపీ నిర్మించిన అన్ని కార్యాలయాలకు అనుమతులు ఉన్నాయా?
- వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు మాకు దేవాలయాలులాంటివి
- చట్టప్రకారం మా దేవాలయాలను కాపాడుకుంటాం
::: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(విశాఖపట్నం)
ఇది అప్రజాసామ్విక చర్య
తాడేపల్లి వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయాన్ని అన్యాయం కూల్చేయడం చట్ట వ్యతిరేక చర్య
ప్రజలకు అభివృద్ధి పాలన అందిస్తాన్న చంద్రబాబు ఇలాంటి చర్యలు చేపట్టడం వలన ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు
అనుమతులు అన్నీ తీసుకుని చట్టపరిధిలో నిర్మాణం చేస్తుంటే వాటిని కూల్చేయడం దారుణం
ఇది అప్రజాసామ్వికం , ఇది హైకోర్టు ధిక్కార చర్య
:::మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ
అనకాపల్లి కార్యాలయానికీ నోటీసులు
- అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
- అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న కార్యాలయం
- అక్రమ కట్టడమని పేర్కొంటూ నోటీసులు
- ఏడాది క్రితం ప్లాన్ అప్రూవల్ కోసం చేసిన దరఖాస్తు.. ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న అధికారులు
- వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో స్పష్టీకరణ
నెల్లూరు వైఎస్సార్‌సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
- నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆఫీస్
- అనుమతులు చూపాలంటూ మున్సిపల్ అధికారుల జులుం.. ఉద్రిక్తత
- హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
- బిల్డింగ్‌కు అన్ని అనుమతులు తీసుకున్నామని వివరణ
- అయినా తగ్గని అధికారులు
- రెండు రోజులు గడువు కోరిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
ఇదేనా చట్టబద్ధమైన పరిపాలన?
- ఇది ప్రభుత్వ స్థలమే
- ప్రభుత్వ స్థలం అయినా.. లీజ్‌కు తీసుకున్నాం
- కేబినెట్ ఆమోదం పొందాకే స్థలం తీసుకున్నాం
- ఒక పద్ధతి ప్రకారమే నిర్మాణాలు చేపట్టాం
- టీడీపీకి మమ్మల్ని అనే హక్కు లేదు
- ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ స్థలాల్లో పార్టీ నిర్మాణాల్ని చేపట్టింది
- నోటీసులు ఇచ్చాక పదిహేను రోజుల టైం ఉంటుంది
- కోర్టు చెప్పినా పట్టించుకోకుండా ఆగమేఘాల మీద రెండున్నర గంటల్లోనే, అదీ వేకువజామున భవనం కూల్చేశారు
- నిర్మాణంలో ఉన్న భవనాన్ని నిర్దాక్షిణ్యంగా.. కక్ష పూర్వకంగా చేసిన ఈ పనిని ఖండించాలని ప్రజాస్వామ్య వాదుల్ని కోరుతున్నా
- అధికారం శాశ్వతం కాదు.. ఇలా కూల్చేయడం ధర్మం కాదు
- మాది రాజకీయ పార్టీ కాదా?.. కార్యకలాపాలు నిర్వహించుకోకూడదా?
- చంద్రబాబుగారూ.. ఇదేనా చట్టబద్ధమైన పరిపాలన?
- ప్రజలు ఇవన్నీ ఆలోచించరని అనుకుంటున్నారా? అసలు ప్రజలు టీడీపీ ప్రభుత్వ చర్యను క్షమిస్తారా?
::: అంబటి రాంబాబు
సీతానగరంలో కూల్చిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో అంబటి రాంబాబు
వైఎస్సార్‌సీపీ ఉనికి లేకుండా చేయాలన్నదే టీడీపీ ప్రయత్నం
- వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ధ్వంసం చెయ్యడం.. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట
- టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు ప్రారంభం అయ్యాయి..
- వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు
- తోటపల్లి గూడూరు మండలం కోడూరులో అక్వా రైతు రంగారెడ్డికి సంబందించిన 50 లక్షలు విలువ చేసే రొయ్యల సామాగ్రిన్ని తగలబెట్టారు..
- పోలీసులకు పిర్యాదు చేసినా.. బాధితులనే ఇబ్బంది పెడుతున్నారు..
- వైఎస్సార్‌సీపీ నేతలకు ఆర్థికంగా నష్టం కల్గిస్తున్నారు..
- కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వకుండా.. ప్రభుత్వ జోక్యం లేకుండానే.. ప్రవేట్ వ్యక్తులు వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు..
- టీడీపీ నేతలు చేస్తున్న పాపాలే.. భవిష్యత్తులో వారికి శాపాలుగా మారుతాయి..
- వైఎస్సార్‌సీపీ ఉనికి లేకుండా చెయ్యాలని టీడీపీ చూస్తోంది
- ప్రజలు అన్నింటిని గమనిస్తూ ఉన్నారు
:::మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు
తెలుగుదేశం పతనానికి ఇదే నాంది
- వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయాన్ని దురుద్దేశం పూర్వకంగా కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోతుంది
- గతంలో కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మించినప్పటికీ కూడా మా ప్రభుత్వం కూల్చి వేయలేదు
- రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థని లెక్కచేయకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు.
- తెలుగుదేశం పార్టీ పతనానికి ఇదే నాంది
- టీడీపీ అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి YSRCP నేతలపై దాడులు చేస్తున్నారు.. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు
:::మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళం
ప్రజలే గుణపాఠం చెబుతారు
- వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేయడం దుర్మార్గమైన చర్య
- కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ కూల్చివేయడం హేయమైన చర్య
- కూటమినేతలుప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం,వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకుల పై దాడులు ప్రజలు గమనిస్తున్నారు
- చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇలాగే కూల్చి వేస్తారనీ హెచ్చరిస్తున్నాం
- వారి పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉండటాన్ని ఓర్చుకోలేక ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారు
- ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటిచర్యలు గొడ్డలి పెట్టు లాంటివి
- ప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేశామా? అనిబాధపడే పరిస్థితులు వచ్చాయి
- సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అనున్న ప్రజలకు.. రాష్ట్రాన్ని బీహార్ల మార్చేసి చూపిస్తున్నారు
- చంద్రబాబుకు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెబుతారు
:::కంభం విజయరాజు, చింతలపూడి వైఎస్సార్‌సీపీ కన్వీనర్ (ఏలూరు)
సంబంధిత వార్త: తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేత
టీడీపీ దుర్మార్గాలపై న్యాయ పోరాటం
- రాజకీయ కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదు
- తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం
- సూపర్ సిక్స్ అమలకన్నా కక్ష సాధింపు చర్యలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు
- టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాల కోసం అనేక స్థలాలను తీసుకుంది
- మేము ఏ రోజు వాటి జోలికి వెళ్లలేదు వాటిని ధ్వంసం చేయలేదు
- టీడీపీ దుర్మార్గాలపై న్యాయ పోరాటం చేస్తాం
::కొండా రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి(విశాఖపట్నం)
విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నోటీసులు
- ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు జీవీఎంసీ అధికారులు
- పార్టీ కార్యాలయానికి పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసులు
- అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ నోటీసులో పేర్కొన్న అధికారులు
- వారం గడువు.. వివరణ ఇవ్వాలని ఆదేశాలు
- నోటీసుల సంగతి తెలిసి ఆఫీస్‌కు చేరుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- ఆగ్రహంతో నోటీసుల్ని చించిపడేసిన అమర్నాథ్
దొంగల్లాగా కూల్చేశారు
- చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండ అరాచక తీరు బాధాకరం.
- తెలుగుదేశం సభ్యులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేసే 24 గంటలు గడవకముందే విధ్వంసకాండ కు తరలేపారు
- కోర్టు ఆదేశాలు ఉన్నా సరే వాటిని బేఖాతరు చేశారు
- పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం వారి అరాచక పాలనకు నిదర్శనం
- దొంగల్లాగా తెల్లవారుజామున పోలీసుల పహారాలో కూల్చివేయడం బాధాకరం
- జరుగుతున్న విధ్వంసకాండను టీవీ ఛానల్ లో కూడా రానివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించారు
- ఒకపక్క డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కక్ష సాధింపు రాజకీయాలు ఉండవంటారు.. మరోవైపు చంద్రబాబేమో ఇలా కూల్చివేతలకు ఆదేశాలిస్తారు!
:::ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, నంద్యాల
మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకి చురకలు అంటించారు. సూపర్ సిక్స్ అమలు కన్నా.. వైఎస్సార్‌సీపీ ఆఫీసులను కూల్చడమే ఆయన ముఖ్యమని భావిస్తున్నారా?. ఇంతకీ చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అని ఎక్స్‌లో అంబటి సందేశం ఉంచారు.
ఇదీ చదవండి: చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదు
మరోవైపు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి ఈ అంశంపై ట్వీట్ చేశారు.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత
ఉదయం 5:30 గంటల సమయంలో పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత.
శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు.
కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న… pic.twitter.com/zCeLpHiZPE— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 22, 2024
ఏం జరిగిందంటే..
తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఇది అక్రమ కట్టడం అంటూ గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సీఆర్డీఏ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(MTMC)లకు ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏ చర్యలకు సిద్ధం అవ్వగా.. ఆ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ న్యాయవాది సీఆర్డీఏ దృష్టికి తీసుకెళ్లారు.
అయినప్పటికీ సీఆర్డీఏ వైఎస్సార్‌సీపీ న్యాయవాది చెప్పిన అంశాన్ని పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ.. ఎంటీఎంసీకి కూల్చివేత ఆదేశాలిచ్చింది. దీంతో ఆ ఆదేశాలతో ఆరు బుల్డోజర్లను పట్టుకుని మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. కేవలం రెండున్నర గంటల్లో నిర్మాణంలో ఉన్న పోర్షన్‌ను కూల్చేశారు.
YSRCP రియాక్షన్
టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజూ ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినా.. కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దని అత్యున్నత న్యాయస్థానం సూచించినా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని మండిపడుతోంది. ఏపీలో కూటమి విధ్వంస పాలనపై న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది.
ఏపీలో మొదలైన @JaiTDP కూటమి విధ్వంస పాలన!
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత
ఉదయం 5:30గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు
కూల్చివేతకు… pic.twitter.com/x8cEiPlGYo— YSR Congress Party (@YSRCParty) June 22, 2024
Comments
Please login to add a commentAdd a comment