
సాక్షి, హైదరాబాద్: సచివాలయం భవనాల కూల్చివేతను కవర్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ దాఖలైంది. పటిషన్‌లో కూల్చివేతను కవర్ చేయకుండా ఆంక్షలు పెట్టారని పిటిషనర్ పేర్కొన్నారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసుల బారికేడ్లు వేసి ఎవరిని అనుమతించడం లేదని తెలిపారు. (చదవండి: కూల్చివేతకు లైన్‌క్లియర్)
ప్రజల డబ్బుతో నిర్మించిన అధికార భవనాలను కూల్చి వేసిన, కొత్తవి నిర్మాణం చేసిన ప్రజలకు తెలియాల్సిన అవసంరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కూల్చివేతకు కవరేజ్‌కు మీడియాకు అనుమతించకపోవడమనేది రాజ్యాంగం కల్పించిన మీడియా స్వేచ్చను హరించడం అవుతుందన్నారు. సెక్రెటరేట్ కూల్చివేత సమయంలో మీడియా కవరేజ్‌కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోర్టు కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హకోర్టు విచారణ చెపట్టనుంది. (చదవండి: కొత్త సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి ప్రకటన)