సాక్షి, హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్‌టిఎల్, బంఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాం. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిపారు’’ అని హైడ్రా స్పష్టం చేసింది.
తుమ్మిడికుంట, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌పై 2014లోనే హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో హెచ్‌ఎండీఏ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014లో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్థారించమని హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే ఎఫ్‌టీఎల్ సర్వే చేసి నివేదిక అందించాం. మేమిచ్చిన నివేదికపై ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు.’’ అని హైడ్రా పేర్కొంది.
‘‘ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఎలాంటి స్టే ఇవ్వలేదు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. ఎన్ కన్వెన్షన్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆక్రమణలను రెగ్యులర్ చేయించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది.. కానీ అధికారులు తిరస్కరించారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణల వల్ల హైటెక్స్ పరిధిలోని నాలాలు మూసుకుపోయి వరద వస్తుంది. ఆక్రమణల వల్ల తమ్మిడికుంట చెరువు 50 నుంచి 60 శాతం వరకు కూచించుకుపోయింది.’’ అని హైడ్రా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment