మోహన్‌దాస్ గాంధీకి ‘మహాత్మ’ అన్న బిరుదు ఇచ్చినదెవరు? నిస్సందేహంగా విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరేనని గుజరాత్ హైకోర్టు మూడు రోజుల క్రితం తీర్పు చెప్పింది. ఈ విషయం చిన్న తరగతుల పాఠ్య గ్రంథాలలోనే ఉందనీ, నిజానికి ఈ విషయాన్ని జాతికి తెలియచేసిన ఘనత వాటిదేననీ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జేబీ పార్దివాలా తీర్పు చెప్పారు.
రాజ్‌కోట్ జిల్లా పంచాయతీ శిక్షణ సమితి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో గాంధీజీని మహాత్మ అని మొదట పిలిచినవారు ఒక పత్రికా రచయిత అని పేర్కొంది. దీని మీద సంధ్యా మారు అనే యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంతో మహాత్మ అని గాంధీజీని మొదట పిలిచినవారు రవీంద్రులేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ సంధిగ్ధం తొలగిపోయినందుకు సంతోషిద్దాం.
ఆ మాట రవీంద్రుడిదే
Published Sun, Feb 21 2016 1:29 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement