తమ జీవితంలో గాంధీ మెమోరియల్ యాత్ర చిరకాలం గుర్తిండిపోతుందని భారత చిన్నారులు తెలిపారు.
జోహన్నెస్‌బర్గ్: తమ జీవితంలో గాంధీ మెమోరియల్ యాత్ర చిరకాలం గుర్తిండిపోతుందని భారత చిన్నారులు తెలిపారు. మహాత్మగాంధీ జీవితంపై కేరళలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన చిన్నారుల్ని దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివసించిన ప్రాంతాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి భారత కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిన్నారులు మాట్లాడారు.
ఈ యాత్ర తన లో బాగా మార్పును తీసుకు వచ్చిందని, గాంధీజీ ఆచరించిన విలువల్ని తాను ఇక నుంచి పాటిస్తానని క్రిస్ ల్యూక్ అనే చిన్నారి పేర్కొన్నాడు. మరోవైపు ఆనాటితో పోలిస్తే ఈ రోజుల్లో సమాజంలో మార్పు వచ్చిందని, కానీ గాంధేయ విలువలు ఆదర్శంగా ఉన్నాయని స్వాతి అనే మరో చిన్నారి పేర్కొంది. ఈ యాత్రలో గాంధీ మునిమనవ రాళ్లు ఈలా గాంధీ, కీర్తి మీనన్‌ను కలుసు కున్నారు. అలాగే డర్బన్‌లో గాంధీ నిర్వహించిన ఫీనిక్స్ ఆశ్రమాన్ని విద్యార్థులు సందర్శించారు.